Murder: తప్ప తాగి అమ్మానాన్నతో గొడవ పడుతున్నాడని.. అన్నను గొంతుకోసి చంపిన తమ్ముడు..

Man Kills Alcoholic Elder Brother: సహనం కోల్పోయిన తమ్ముడు అన్నను కడతేర్చాడు. రోజూ తాగి వచ్చి అమ్మా నాన్నతో అన్న గొడవపడుతున్నాడు. ఇది చూసి సహించలేని తమ్ముడు

Murder: తప్ప తాగి అమ్మానాన్నతో గొడవ పడుతున్నాడని.. అన్నను గొంతుకోసి చంపిన తమ్ముడు..
Brutal Murder

Updated on: Jun 05, 2021 | 9:00 AM

Man Kills Alcoholic Elder Brother: సహనం కోల్పోయిన తమ్ముడు అన్నను కడతేర్చాడు. రోజూ తాగి వచ్చి అమ్మా నాన్నతో అన్న గొడవపడుతున్నాడు. ఇది చూసి సహించలేని తమ్ముడు క్షణికావేశంలో అన్నను చంపాడు. ఈ సంఘటన మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌ పరిధిలోని కొత్వాల్ బుర్ధి గ్రామంలో చోటుచేసుకుంది. బుర్ది గ్రామానికి చెందిన చంద్ర‌శేఖ‌ర్ బ‌దాఖ‌ల్‌, గ‌ణేశ్ అన్నాద‌మ్ముళ్లు. నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు ప‌దార్థాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ప‌నిచేస్తున్న చంద్రశేఖర్ తాగుడుకు బానిస‌య్యాడు.

ఈ క్ర‌మంలో ప్ర‌తిరోజు తాగి వచ్చి త‌ల్లిదండ్రులతో గొడ‌వ‌ప‌డుతున్నాడు. దీంతో ఓపిక న‌శించిన గ‌ణేశ్.. 34 ఏళ్ల చంద్ర‌శేఖ‌ర్‌ను గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగింది. రోజూ లాగానే చంద్రశేఖర్ తాగి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడుతుంటే ఆవేశంలో చంద్రశేఖర్‌ను హ‌త్య‌చేశానని నిందితుడు గణేష్ పోలీసులకు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తమ్ముడు గణేష్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read:

Indian Railways: రైళ్లలో విస్తృతంగా టికెట్ చెకింగ్ డ్రైవ్‌లు.. టికెట్ లేకుండా ప్రయాణికుల నుంచి రూ. 9.5 కోట్లు వసూలు

Etela rajender: నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్..