Hyderabad: పెళ్లైన ప్రియురాలిని దారుణంగా చంపిన ప్రియుడు.. తనతో రానన్నందుకు..

|

Aug 11, 2021 | 7:54 AM

Girl Friend Murder: ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాడు. చివరకు పెళ్లైన ప్రియురాలిని తనతో రావాలని కోరగా.. ఆమె నిరాకరించినందుకు..

Hyderabad: పెళ్లైన ప్రియురాలిని దారుణంగా చంపిన ప్రియుడు.. తనతో రానన్నందుకు..
Girl Death
Follow us on

Woman Murder: ప్రియురాలిని కలిసేందుకు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాడు. చివరకు పెళ్లైన ప్రియురాలిని తనతో రావాలని కోరగా.. ఆమె నిరాకరించినందుకు.. ప్రియుడు అతని స్నేహితుడి సహాయంతో దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన పూజ వర్మ (21), రాజేశ్‌ వర్మకి మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి అనంతరం హైదరాబాద్ నగరానికి వచ్చి జీడిమెట్ల వినాయక్‌నగర్‌లో నివాసముంటున్నారు. భర్త స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

గృహిణిగా ఉన్న పూజా వర్మ.. మాజీ ప్రియుడు రాకేష్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో సరదాగా ప్రియుడిని చూసేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. దీంతో రాకేష్ 24 గంటల్లో ఓ స్నేహితుడిని వెంటబెట్టుకొని వచ్చి కలిశాడు. అనంతరం తన వెంట రావాలని ఇద్దరం కలిసుందామని ప్రియుడు.. ప్రియురాలిని కోరాడు. దీనిని ప్రియురాలు నిరాకరించింది. దీంతో.. రాకేష్ తన స్నేహితుడితో కలిసి పూజను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి పరారయ్యాడు.

అనంతరం నిందితులిద్దరూ మృతురాలి మంగళసూత్రం, బంగారు చైన్ లతో పరారయ్యారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త రాజేశ్‌ వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Crime News: మొబైల్ కోసం ఘర్షణ.. అన్నను ముక్కలుగా నరికి తోటలోనే పాతిపెట్టిన తమ్ముడు.. ఎక్కడ జరిగిందంటే..

Crime News: తల్లిని బెదిరించి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి..