Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి.. ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు అతని వేధింపులు భరించలేని వివాహిత.. పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న.. స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ప్రశాంత్ స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని.. అంగీకరించకపోతే.. చచ్చిపోతాను.. లేదంటే చంపుతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్ తరచూ వేధింపులకు గురిచేశాడు.
ఇలా వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా రికార్డ్ చేసినట్లు బాధితురాలి పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఆమెను, ఆమె పిల్లలు, భర్తను చంపేస్తానంటూ ప్రశాంత్ బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే.. వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తూ బాధితురాలు నుంచి ఇప్పటి వరకు రూ.16 లక్షలు వసూలు చేశాడు.
చివరకు వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: