Harassment: హైదరాబాద్ బంజారా హిల్స్‌లో దారుణం జరిగింది. ఓ ప్రబుద్ధుడు తల్లితో సహ జీవనం చేస్తూ.. కూతిరిపై లైంగిక దాడికి దిగిన ఘటన సమాజంలో విలువల పతనానికి పరాకాష్టగా మారింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళకు 15 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబంలో గొడవలు జరగడంతో భర్తను వదిలేసిన మహిళ పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ సమయంలో ఆమెకు స్థానికంగా సెంట్రింగ్ పనిచేసే బేతమాల కృష్ణ (35) అనే వ్యక్తితో పరిచయం ఏర్పండింది.
ఆ పరిచయం కాలక్రమేణా వైవాహిక బంధానికి దారి తీసింది. పిల్లలకు తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత.. కొద్ది రోజుల క్రితం పనికోసం హైదరాబాద్ చేరుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 సమీపంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే బోనాల పండుగకు మెట్టుగూడలో ఉన్న తల్లి ఇంటికి ఆ మహిళ తన కూతురుని పంపించింది.
అయితే అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచి వచ్చిన తర్వాత కూతురు దిగాలుగా ఉండడంతో అనుమానం వచ్చిన మహిళ ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో కూతురు చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ నెల 7వ తేదీని ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కుమార్తె తల్లికి వివరించింది. దీంతో ఆమె ఒక్కసారి కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు నిందితిడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read: Smuggling: ఇది పెయింట్ అనుకున్నారో పప్పులో కాలేసినట్లే.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔటే..!
Loan Apps Case: లోన్ యాప్స్ కేసులో ఆ బ్యాంకు మేనేజర్ అరెస్టు.. ఈ కంత్రీగాడి కన్నింగ్ పని ఏంటంటే