Suicide Attempt : భార్యను బెదిరించాలని ఒంటిపై పిచ్చిగా పెట్రోల్ పోసుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే..

|

Feb 28, 2021 | 4:52 AM

Suicide Attempt : భార్యను భయబ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో

Suicide Attempt : భార్యను బెదిరించాలని ఒంటిపై పిచ్చిగా పెట్రోల్ పోసుకున్నాడు..  తర్వాత ఏం జరిగిందంటే..
Follow us on

Suicide Attempt : భార్యను భయబ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో మద్యం మత్తులో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని అబ్బని కుంటకు చెందిన వనజ హరికృష్ణ భార్యాభర్తలు. నిత్యం హరికృష్ణ మద్యం సేవించి భార్య వనజను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హరికృష్ణ పెట్టే ఇబ్బందులతో మనస్తాపానికి గురై వనజ, హరికృష్ణ నుండి తనను కాపాడాలంటూ మిల్క్ కాలనీ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. కేసు విషయమై పోలీస్ స్టేషన్ రావాలని ఫోన్ చేయడంతో హరికృష్ణ ఆందోళనకు గురయ్యాడు. భార్య, పోలీసులను బెదిరించాలని అనే ఉద్దేశంతో ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో పెట్రోల్ క్యాన్ పెట్టుకొని స్టేషన్ ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పి పోలీసు వాహనంలో చికిత్సకోసం హరికృష్ణ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో హరికృష్ణ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భర్తపై కోపంతో కొడుకును రోడ్డుపై వదిలేసిన తల్లి..

దంపతుల మధ్య విబేధాలతో ఇద్దరు కొడుకుల్లో ఒకరిని తీసుకొని మేనమామల వద్ద ఉంటుంది.. అయితే భర్తపై ఉన్న కోపంతో ఉన్న కొడుకుని వదిలించుకోవాలనుకుని.. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది.. పోలీసులు చేరదీసిన నాలుగు గంటల్లోపే బాలుడిని   తండ్రికి అప్పగించారు.  ఈ సంఘటన కుందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన రాధికకు కేశంపేట మండలం, సంతపూరు గ్రామానికి చెందిన దయ్యాల శ్రీకాంత్‌తో 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. శ్రీకాంత్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాధిక ఇంటి వద్దనే ఉంటుంది. ఇటీవల దంపతుల మధ్య విబేధాలు రాగా రాధిక ఒక కుమారుడు అనిరుధ్‌(3)ను తీసుకుని కటికపల్లి గ్రామంలో ఉంటున్న మేనమామల వద్ద  ఉంటుంది. భర్తపై ఉన్న కోపంతో కన్న కొడుకు అనిరుధ్‌ను శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కుందుకూరు చౌరస్తాలో వదిలి వెళ్లింది..  అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులు గమనించి బాలుడిని చేరదీసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

కిరోసిన్ పోసుకొని తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన పెను ప్రమాదం..