Brutal murder in Warangal: తెలంగాణలోని వరంగల్ నగర పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగుడు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట మండలం రాంపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య అలియాస్ అల్లాసేట్ అనే వ్యక్తి కూతురు, మనమడితో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి గొడ్డలితో తలపై నరికి కిరాతకంగా హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటన చూసిన కూతురు కళ్లు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న వారు ఇది చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కాజీపేట్ ఏసీపీ రవీంద్ర కుమార్, మడికొండ సీఐ రవికుమార్ ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ సంఘటన వరంగల్‌లో కలకలం రేపింది.
Also Read: