Maharshtra Chopper Crash: మహారాష్ట్రలోని జిల్గాన్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలెట్ దుర్మరణం చెందగా.. మరో మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన చిన్న తరహా ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో.. ఇద్దరూ పైలెట్లు ప్రయాణిస్తుండగా శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చోప్డా జిల్లా వార్ది గ్రామ సమీపంలోని సత్పురా పర్వత శ్రేణి పరిధిలో శిక్షణ విమానం కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
గాయపడిన మహిళా పైలెట్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక లోపం కారణంగానే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీశారు. పూర్తి వివరాలు సమర్పించాలని శిక్షణ అధికారులను ఆదేశించారు.
Maharashtra: One person dies, another injured in a chopper crash in Jalgaon; police & local authorities on the spot. Details awaited pic.twitter.com/Mc0aUPsWKA
— ANI (@ANI) July 16, 2021
Also Read: