Maharashtra Man Kills Girlfriend: ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.. గత ఐదేళ్లుగా సహజీవనం చేశాడు.. పెళ్లి చేసుకోమన్నందుకు అన్ని ఏళ్ల ప్రేమను మరచిపోయి దారుణంగా హత్య చేశాడు.. మళ్ళీ తాను చేసిన దారుణం బయటకు తెలియకుండా ఇంట్లోని గోడలో శవాన్ని దాచి పెట్టాడు. అదే ఇంట్లో మూడు నెలల నుంచి నివసిస్తున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిందితుడు పాల్‌గఢ్ జిల్లాలోని వనగామ్‌లో గత ఐదేళ్లుగా 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, మూడు నెలలుగా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు నిందితుడిని ఆమె గురించి అడగగా… పని నిమిత్తం గుజరాత్ లోని వాపికి వెళ్ళింది త్వరలో వస్తుందని చెప్పాడు. ఎన్నిరోజులైనా మహిళ తిరిగి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళతో సహజీవనం, చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పొంతన లేని అతని సమాధానాలతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు పెళ్లి చేసుకోమని అడిగిందని అందుకనే హత్య చేసి.,. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఇంటి గోడలో దాచి పెట్టినల్టు చెప్పాడు. పోలీసులు గోడను తవ్వి మృతదేహాన్ని వెలికి తీయగా అప్పటికే దాదాపు అస్థిపంజరంగా మారింది. ఆ యువతిని అక్టోబర్ 21న చివరి సారిగా చూశామని స్థానికులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు.
Also Read: ముచ్చటగా మూడుసార్లు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ లవబుల్ కపుల్..