Maharashtra: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు రోగుల మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం

|

Nov 06, 2021 | 1:09 PM

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐసీయూ వార్డులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.

Maharashtra: కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు రోగుల మృతి.. మరో 11 మంది పరిస్థితి విషమం
Fire Accident
Follow us on

Maharashtra Covid Hospital Fire Accident: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్‌లోని కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐసీయూ వార్డులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. మంటల ధాటికి బయటకు రాలేక చిక్కుకుపోయిన ఆరుగురు కరోనా పేషెంట్స్‌ సజీవదహనమయ్యారు. ప్రమాదం సమయంలో కరోనా వార్డులో 17మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదంలో గాయపడ్డ మిగిలిన 11మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బందితో సహా వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది.

ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఉదయం 11.30 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అటు, జమ్ముకశ్మీర్‌లో వరుస అగ్నిప్రమాదాలు..ఎస్‌. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. జమ్ముకశ్మీర్‌ కిష్త్వార్‌లో 3 అంతస్తుల భవనంలో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు ఆ భవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.


Read Also… Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. అదెక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.!