AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh Crime: ఆమె వయసు 42.. అతనికి 30.. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. !

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో స్నేహం చేసి, ప్రేమ పేరుతో మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కంటే 12 సంవత్సరాలు చిన్న వయసు కలిగిన యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితుడయ్యాడు.

Madhya Pradesh Crime: ఆమె వయసు 42.. అతనికి 30.. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. !
Woman Cheated
Balaraju Goud
|

Updated on: Jan 21, 2024 | 6:36 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో స్నేహం చేసి, ప్రేమ పేరుతో మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కంటే 12 సంవత్సరాలు చిన్న వయసు కలిగిన యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితుడయ్యాడు. ఈ స్నేహం ఎంతగా పెరిగిందంటే ఆ యువకుడు తన ఇంటిని వదిలి ఉజ్జయినికి వచ్చి సదరు మహిళతో కలిసి జీవించేంతలా.

ఆ యువకుడు కొన్ని నెలలు ఆ మహిళతో సంతోషంగా గడిపాడు. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అందుకు నిరాకరించాడు. దీంతో మహిళ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనను పెళ్లికి రప్పించి అత్యాచారం చేశాడని యువకుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలు నాగ్‌జిరిలో నివాసం ఉంటున్న 42 ఏళ్ల ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు మహిళా పోలీసులు తెలిపారు. గత సంవత్సరం, ఆమె ఇంటర్నెట్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బార్వే జిల్లా ఓబ్రా కాలనీకి చెందిన 30 ఏళ్ల నీరజ్ కుమార్ శర్మతో స్నేహం చేసింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీని తర్వాత, నీరజ్ జూలై 2023లో ఉజ్జయినికి వచ్చారు. ఏకంగా అతను ఉపాధ్యాయుని ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టీచర్‌ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. శర్మ చాలా రోజులుగా టీచర్ వద్దే ఉండి, సహాజీవనం చేశారు. ఇటీవల శర్మను పెళ్లి చేసుకోవాలని మహిళ కోరగా, అతడు నిరాకరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ.

దేవాస్‌ రోడ్‌ నాగ్‌జిరి ప్రాంతంలో నివాసముంటున్న ఉపాధ్యాయురాలు ఇద్దరు పిల్లలకు తల్లి అని, భర్త నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు సమాచారం. రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసేది. కొన్నాళ్ల క్రితం నీరజ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం పెంచుకుంది. తనను తాను ఐటీ ఇంజనీర్‌గా చెప్పుకుంటూ ఆ మహిళతో మాట్లాడటం ప్రారంభించిన నీరజ్, టీచర్‌ను విశ్వాసంలోకి తీసుకుని పెళ్లి సాకుతో ఆమెను కలవడానికి ఉజ్జయిని వచ్చాడు. ఉపాధ్యాయురాలిపై రెండ్రోజులుగా అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఎస్పీ సచిన్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఛేదించేందుకు కేసును మహిళా పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. సోషల్ మీడియాలో స్నేహితులైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ శర్మ, ఉజ్జయినికి చెందిన మహిళ ఇద్దరూ తమ నిజాల్ని ఒకరికొకరు దాచుకున్నట్లు విచారణలో మహిళా పోలీసులు గుర్తించారు. ఆ మహిళను కలవడానికి నీరజ్ ఉజ్జయిని వచ్చినప్పుడు, ఆమె వయస్సు చూసి షాక్ అయ్యాడు. ఆ మహిళ అతని కంటే దాదాపు 12 సంవత్సరాలు పెద్దది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నీరజ్ సోషల్ మీడియాలో ఆమెతో మాట్లాడే విధానం, అతని వయస్సు చిన్నదని అనిపించలేదని భావించిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…