పుట్టినరోజు నాడు అసభ్యకరంగా న్యాయమూర్తికి మెస్సేజ్.. జైలు ఊచలు లెక్కబెడుతున్న న్యాయవాది..
MP lawyer in jail: న్యాయమూర్తికి ఓ న్యాయవ్యాది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. అసభ్యకరంగా మెస్సేజ్ చేశాడు. దీంతో పోలీసులు అతనిపై ఐటీ, తదితర చట్టాల ప్రకారం కేసు నమోదు..
MP lawyer in jail: న్యాయమూర్తికి ఓ న్యాయవ్యాది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. అసభ్యకరంగా మెస్సేజ్ చేశాడు. దీంతో పోలీసులు అతనిపై ఐటీ, తదితర చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. దీంతో అతను జైలు ఉచలను లెక్కబెడుతున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలోని విజయ్ సింగ్ యాదవ్ (37) అనే న్యాయవాది జనవరి 28న తెల్లవారుజామున 1.11 గంటల సమయంలో.. ఈ మెయిల్ ద్వారా జిల్లాలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జెఎంఎఫ్‌సి) కు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపాడు. దీంతోపాటు నిందితుడు.. జడ్జీ ఫెస్‌బుక్ నుంచి ఆమె ప్రొఫైల్ పిక్‌ను సైతం డౌన్‌లోడ్ చేసి అసభ్య పదజాలంతో స్పీడ్ పోస్ట్ సైతం చేశాడు. అనంతరం జిల్లా జడ్జి సీరియస్ అయ్యారు. ఆమె సూచన మేరకు రత్లం జిల్లా కోర్టు సిస్టమ్ ఆఫీసర్ మహేంద్ర సింగ్ చౌహాన్.. ఫిబ్రవరి 8 న స్టేషన్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెయిలే కాకుండా, జడ్జికీ స్పీడ్ పోస్ట్ ద్వారా గ్రీటింగ్ కార్డు కూడా పంపినట్లు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు విజయ్ సింగ్‌పై మోసం, ఫోర్జరీ, ఐటీ తదితర చట్టాల ఆధారంగా కేసునమోదు చేశారు.
అనంతరం అడ్వకేట్ ఫిబ్రవరి 9 నుంచి జైలులో ఉన్నాడు. అరెస్టు చేసిన నాలుగు రోజుల తరువాత ఫిబ్రవరి 13 న దిగువ కోర్టు యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన కుటుంబం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను సంప్రదించింది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. అయితే.. తాను రత్లం సామాజిక కార్యకర్తగా, జై కుల్ దేవి సేవా సమితి అధ్యక్షుడిగా పుట్టినరోజు శుభాకాంక్షలు పంపించానని, తాను ఈ చిత్రాన్ని గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నానంటూ.. విజయ్ సింగ్ తెలిపారు.
Also Read: