రాహుల్.. కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేతను అడుగుతున్న ప్రముఖులు, నెటిజన్లు.. ఫొటో వైరల్

Rahul Gandhi's Viral Photo: కరోనావైరస్ 2020 సంవత్సరాన్ని పీడకలగా మార్చింది. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. చాలామంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. లాక్‌డౌన్ కొంతమందికి..

రాహుల్.. కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేతను అడుగుతున్న ప్రముఖులు, నెటిజన్లు.. ఫొటో వైరల్
Follow us

|

Updated on: Mar 02, 2021 | 9:46 AM

Rahul Gandhi’s Viral Photo: కరోనావైరస్ 2020 సంవత్సరాన్ని పీడకలగా మార్చింది. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. చాలామంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. లాక్‌డౌన్ కొంతమందికి విషాదాన్ని చేకూర్చగా.. మరికొంతమందికి ప్రయోజనంగా మారింది. పలు పనులను నేర్చుకోవడానికి కరోనా లాక్‌డౌన్ బాగా ఉపయోగపడింది. అయితే ఈ కాలంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. జిమ్‌ను అస్సలు వదిలిపెట్టకుండా.. ఫిట్నెస్‌పై ద‌ృష్టిసారించారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ చాలాకీగా.. ఈతకొట్టడం, పుష్‌అప్స్ చేయడం లాంటివి చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాహుల్ కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు.

ఇటీవల కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా సముద్రంలో దూకి ఈత కొట్టారు. అంతటితో ఆగకుండా కొద్దిసేపు వల పట్టుకుని చేపలు పట్టి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈత కొట్టిన అనంతరం తడి బట్టలతో బయటకు వచ్చిన రాహుల్‌ గాంధీని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసినవాళ్లంతా.. తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్‌ కండలపైనే చర్చ చేస్తూ.. ఆశ్యర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు.

ఫిబ్రవరి 25వ తేదీన రాహుల్‌ కేరళలోని కొల్లం జిల్లా పర్యటనలో భాగంగా.. తంగసరి బీచ్‌‌కు వెళ్లారు. ఈతగాళ్లు, మత్స్యకారులతో కలిసి సముద్ర పర్యటనకు వెళ్లిన రాహుల్‌ ఒక్కసారిగా ఆరేబియా సముద్రంలో దూకి కొద్దిసేపు ఈతకొట్టారు. చల్లటి నీటిలో ఈతకొట్టిన అనంతరం పైకి రాగా నీలి రంగు టీషర్ట్‌‌లో రాహుల్‌ కండలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో నెటిజన్లు రాహుల్‌ రిబ్స్.. సూపర్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. బాక్సర్‌ మాదిరి కండలు పెంచారని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెప్పాలని ట్విటర్‌, ఇన్‌స్టా, ఫేసుబుక్‌ తదితర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అడుగుతున్నారు.

నెటిజన్లతోపాటు.. ఈ ఫొటోను చూసి ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కూడా ఈ ఫోటోపై స్పందించాడు. బాక్సర్‌ కండలు.. చాలా ధైర్యం గల ప్రజల వ్యక్తి ముందుకు సాగిపో అని విజయేందర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోను షేర్ చేసిన వారిలో కుల్దీప్ యాదవ్, రాజీవ్ శుక్లా, గౌరవ్, కాంగ్రెస్ నేతలు, పలువురు నెటిజన్లు ట్విట్ చేశారు. రాహుల్‌ ఒక బాక్సర్‌.. బౌన్సర్‌గా కనిపిస్తున్నారంటూ ట్రోల్‌ చేస్తూ.. కొన్ని టిప్స్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇదిలాఉంటే.. దీనిపై ఫన్నీ మీమ్స్‌ కూడా పుట్టుకొస్తున్నాయి.

Also Read: