Crime News: మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

కృష్ణా జిల్లాలో పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి చెందింది.

Crime News: మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Suicide

Updated on: Nov 04, 2021 | 12:48 PM

Woman Constable Suspected Death: కృష్ణా జిల్లాలో పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి చెందింది. మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తన్న ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడిందని సోలీసులు తెలిపారు. తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రశాంతి.. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also… PM Modi: సైనికుల కోసం ప్రోటోకాల్‌ పక్కనబెట్టిన ప్రధాని.. హంగు ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా మారిన మోడీ..