Lovers suicide in krishna District: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి సమీపంలో ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ శనివారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో వెతికారు.
ఈ క్రమంలో యువతి, యువకుడు పెదకళ్లేపల్లి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు అక్కడి వెళ్లి పరిశీలించారు. విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ చూసి ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇరువురి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలను కూడా విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: