Lovers sucide in Nizamabad: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని చందూరు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీప్రాంతంలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి.
మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మిగా గుర్తించారు. ఇద్దరూ వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read;