Student Murdered for Love: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బద్వేల్ మండలం చింతలచెరువులో యువతి గొంతుకోశాడు ఉన్మాది చరణ్. మృతురాలు బద్వేల్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి శిరీషగా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని. ఈ ఘాతుకానికి ఇదే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు చరణ్‌ను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువులో శిరీష(19) అనే యువతి తనను ప్రేమించట్లేదని.. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లిన చరణ్.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు శిరీష నిరాకరించింది. దీంతో అతి కిరాతకంగా యువతి గొంతు కోసేశాడు. విషయం గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత చరణ్ కూడా పురుగుల మందు తాగినట్లు సమాచారం. చరణ్‌ను పట్టుకుని గ్రామస్తులు, యువతి బంధువులు చితకబాదారారు.అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని బద్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే చరణ్ ఉన్నాడు. శిరీష మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also….. Nara Lokesh : కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని మరోసారి గుర్తుచేస్తున్నా.. ! ఇదేనా మీ పారదర్శకత..? : లోకేష్