తవ్వేకొద్ది వెలుగు చూస్తున్న కొత్త నిజాలు.. పోలీసుల చేతిలో కీలక టెక్నికల్ ఎవిడెన్స్

|

Mar 02, 2021 | 2:50 PM

కోర్టు మొట్టికాయలతో వామనరావు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. సోమవారం వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన రెండు కత్తుల్ని స్వాధీనం

తవ్వేకొద్ది వెలుగు చూస్తున్న కొత్త నిజాలు.. పోలీసుల చేతిలో కీలక టెక్నికల్ ఎవిడెన్స్
vaman rao advocate
Follow us on

Lawyer Couple Murder Case: కోర్టు మొట్టికాయలతో వామనరావు హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. సోమవారం వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. లెటెస్ట్‌గా కస్టడీలో ఉన్న నిందితుల నుంచి మరిన్ని నిజాలు రాబట్టాలని డిసైడ్ అయ్యారు. బిట్టు శ్రీను, కుంట శ్రీనులను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌ను వీడియోగ్రఫీ చేయనున్నారు పోలీసులు.

మర్డర్‌కి వాడిన కత్తుల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్న పోలీసులు. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్‌తో దర్యాప్తు స్పీడప్ చేశారు. వామన్‌రావును చంపేందుకు ఆలయం వివాదం ఒకటే కారణమా..? హత్యకు దారితీసిన కారణాలు.. ఇద్దరి మధ్య వైరం.. శ్రీను వెనుక శ్రీను కథ.. ఇలా అన్ని కోణాల్లో ఆరాతీయనున్నారు. కస్టడీలో బయటికొచ్చే నిజాలతో మర్డర్‌ చిక్కుముళ్లు వీడుతాయని పోలీసులు భావిస్తున్నారు.

హత్యలో నిందితులు దొరికినప్పటికీ.. ఆధారాల కోసం పెద్ద ప్రయత్నాలే చేశారు పోలీసులు. సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తుల కోసం పెద్ద పెద్ద అయస్కాంతాలతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. గజ ఈతగాళ్లతో బ్యారేజ్‌ జల్లెడపట్టారు. మొత్తానికి కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల్ని బ్యారేజ్‌కి తీసుకెళ్లారు. హత్యానంతరం ఏ రూట్‌లో మహారాష్ట్రకు పారిపోయారనే విషయాలను రాబట్టారు.

ఇక ఇవాళ్టి ఇంటరాగేషన్‌లో బిట్టు శ్రీను, కుంట శ్రీనులు ఏం చెబుతారన్నది కీలకంగా మారనుంది. వామనరావు హత్య కేసులో మొదటినుంచి రాజకీయ పార్టీల నేతల కుట్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే బిట్టు శ్రీను, కుంట శ్రీనుల వెనుక ఎవరైనా లీడర్ హస్తం ఉందా..? లేదంటే వ్యక్తిగత కక్షలతోనే వామనరావును మట్టుబెట్టారా అన్నది ఇవాళ్టి దర్యాప్తులో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

IPL 2021: బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఆ ముగ్గురు.. ఐపీఎల్-2021 వేదికలపై ఫ్రాంచైజీల నిరసన..

India vs England: మొతేరా పిచ్​పై కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు.. తనకు వై-ఫై సరిగా రావట్లేదన్న ఇంగ్లాండ్ ఆటగాడు

Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి