Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి

టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కోవిడ్ టీకా వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతా‌లో పోస్ట్ చేశారు.

Covid-19 Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి
భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను మొదటి మోతాదు అందుకున్నారు.
Follow us

|

Updated on: Mar 02, 2021 | 2:01 PM

Ravi Shastr Gets 1st Dose: టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం కోవిడ్ టీకా వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ట్విటర్ ఖాతా‌లో పోస్ట్ చేశారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, మెడికల్‌ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వాక్సినేషన్‌ ప్రక్రియను ఎంతో నిబద్ధతతో.. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి కూడా ఆయన అభినందించారు.

తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకున్నారు. “ఇప్పుడే కొవిడ్‌-19 వాక్సిన్‌ చేయించుకున్నా. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, మెడికల్‌ సిబ్బందికి ధన్యవాదాలు. అలాగే ఈ వాక్సినేషన్‌ ప్రక్రియను ఎంతో నిబద్ధతతో.. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అహ్మదాబాద్‌ అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి అభినందనలు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

ఇక సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు టీకా వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. నిన్న ఒక్కరోజు రాత్రి వరకు సుమారు 29 లక్షల మంది వాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కాగా, టెస్టు సిరీస్‌ కోసం అహ్మదాబాద్‌లో ఉన్న రవిశాస్త్రి అక్కడే కొద్దిసేపటి క్రితం టీకా వేయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Maoist attack: గన్స్‌, ల్యాండ్ మైన్స్‌తో కాదు.. బాణం బాంబులతో దాడి.. మావోయిస్టుల దుశ్చర్య..

IPL 2021: బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఆ ముగ్గురు.. ఐపీఎల్-2021 వేదికలపై ఫ్రాంచైజీల నిరసన..

India vs England: మొతేరా పిచ్​పై కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు.. తనకు వై-ఫై సరిగా రావట్లేదన్న ఇంగ్లాండ్ ఆటగాడు