AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: మొతేరా పిచ్​పై కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు.. తనకు వై-ఫై సరిగా రావట్లేదన్న ఇంగ్లాండ్ ఆటగాడు

Ind vs Eng:మొతేరా పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు మాజీలు  పిచ్ టెస్టు మ్యాచ్​లకు పనికి రాదంటూ కామెంట్స్ విసురుతుంటే..

India vs England: మొతేరా పిచ్​పై కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు.. తనకు వై-ఫై సరిగా రావట్లేదన్న ఇంగ్లాండ్ ఆటగాడు
England pacer Jofra Archer
Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 1:39 PM

Share

అహ్మదాబాద్‌లోని మొతేరా పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు మాజీలు  పిచ్ టెస్టు మ్యాచ్​లకు పనికి రాదంటూ కామెంట్స్ విసురుతుంటే.. మరికొందరు ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా మరో ఇంగ్లాండ్​ ఆటగాడు జోఫ్రా ఆర్చర్​ మాత్రం సరదాగా తనదైన తరహాలో స్పందించాడు.

ఏ పిచ్​​పై ఆడుతున్నామన్నది అసలు పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. డై/నైట్​ టెస్టు గురించి పెద్దగా ఫిర్యాదు చేయాల్సిన విషయమేమీ లేదంటూ విమర్శలను కొట్టిపారేశాడు. తన వరకైతే ఉన్న సమస్య మాత్రం గ్రౌండ్​లో వై-ఫై సరిగా రావట్లేదని మాత్రం అనిపించిందని అన్నాడు.

కౌంటీల్లో నేను తొలిసారి ససెక్స్​ జట్టుకు ఆడానని అన్నాడు. ఈ మ్యాచ్​లో లీసెస్టర్ షైర్​ను ఓడించాం… ఈ మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లాండ్​లోనూ మ్యాచ్​లు త్వరగానే ముగిశాయనేది గుర్తుంచుకోవాలి అంటూ చురకలు అంటించాడు జోఫ్రా ఆర్చర్. నిజాయితీగా చెప్తున్నా… భారత్​లో పిచ్​లు స్పిన్​కు సహకరిస్తాయని అందరికీ తెలుసని అంటూ.. ఇలాంటివాటిపై బ్యాటింగ్ చేయడం కష్టమనే కదా అర్థం అంటూ ఆర్చర్​ అభిప్రాయపడ్డాడు.

ఇదిలావుంటే మూడో టెస్టు సందర్భంగా తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ జో రూట్​ తమలో స్ఫూర్తిని నింపాడని ఆర్చర్​ పేర్కొన్నాడు. డే/నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అశ్విన్, అక్షర్​ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారిందని అన్నాడు. ఇది గమనించిన మా సారథి రెండో ఇన్నింగ్స్​కు ముందు మాతో చాలా సేపు మాట్లాడాడు. బయం లేకుండా ఆడాలని ప్రోత్సహించాడు. మనమేమీ ఓడిపోమని మాలో ధైర్యం నింపాడుని అన్నాడు. మిగిలిన మ్యాచ్​లకు కూడా ఇదే ధోరణితో ఉండాలని చెప్పాడని  నాయకుడి గురించి చెప్పుకొచ్చాడు ఆర్చర్​.

ఇవి కూడా చదవండి..

Maoist attack: గన్స్‌, ల్యాండ్ మైన్స్‌తో కాదు.. బాణం బాంబులతో దాడి.. మావోయిస్టుల దుశ్చర్య..

IPL 2021: బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఆ ముగ్గురు.. ఐపీఎల్-2021 వేదికలపై ఫ్రాంచైజీల నిరసన..

First Cricket Star to Hit: విరాట్.. విరాట్ స్వరూపం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు…

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..