Lashkar terrorist: ఉగ్రవాదంపై వక్రబుద్ధి మారని పాక్.. అనంత్‌నాగ్‌ జిల్లాలో ల‌ష్కరే తోయిబా కీలక టెర్రరిస్ట్ అరెస్టు

|

Nov 08, 2021 | 5:28 PM

జ‌మ్మూ క‌శ్మీర్ లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ల‌ష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి పిస్టల్‌తో పాటు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Lashkar terrorist: ఉగ్రవాదంపై వక్రబుద్ధి మారని పాక్.. అనంత్‌నాగ్‌ జిల్లాలో ల‌ష్కరే తోయిబా కీలక టెర్రరిస్ట్ అరెస్టు
Terrorist Arrest
Follow us on

Lashkar terrorist in Anantnag District: జ‌మ్మూ క‌శ్మీర్ లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ల‌ష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి పిస్టల్‌తో పాటు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నట్లు భద్రతా బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు, ఆర్మీ జ‌వాన్లు క‌లిసి అక్కడ కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో భాగంగా ఆర్మీ బృందం సెర్చ్ ఆపరేషన్‌లో అనంత్‌నాగ్‌లోని అష్ముకం ప్రాంతంలోని వహదన్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లష్కరే తోయిబా క్రియాశీల ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన ఉగ్రవాదిని హఫీజ్ అబ్దుల్లా మాలిక్‌గా గుర్తించామని, ఇతను ఎల్‌ఇటి షాడో ఔట్‌ఫిట్‌గా భావిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)కి అనుబంధంగా ఉన్నాడని భద్రతా బలగాలు తెలిపాయి.

మాలిక్‌ను అరెస్టు చేసిన సమయంలో అతని వద్ద నుండి ఒక పిస్టల్, ఏడు రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, భద్రతా దళాలు కట్సు అడవుల నుండి ఒక ఎకె రైఫిల్, రెండు మ్యాగజైన్‌లు, 40 రౌండ్‌లను మందు గుండును స్వాధీనం చేసుకున్నాయి.

ఇదిలావుంటే, ఉగ్రవాదంపై తమ వైఖరి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. అక్టోబరు 18న ఈ సంస్థ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 20 మందికిపైగా మరణించారు. వారిలో అత్యధికులు పోలీసులే. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫ్రాన్స్‌లో దైవదూషణకు సంబంధించిన కార్టూన్ల వివాదంలో ఫ్రెంచ్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించాలంటూ టీఎల్‌పీ నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్‌పీని నిషేధించింది.

ఇటీవల ఈ సంస్థతో రహస్య ఒప్పందం చేసుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం ఆ సంస్థపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదివారం ఓ నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. చట్టాన్ని అనుసరించేందుకు కట్టుబడి ఉండడంతో టీఎల్‌పీపై నిషేధాన్ని ఎత్తివేసినట్టు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

Read Also…  Crime news: ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు.. హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా.. అసలు ఏం జరిగింది..