Kulgam Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైన విషయం తెలిసిందే. తాజాగా భద్రతా బలగాలు మరో ఉగ్రవాదిని హతమార్చాయి. ఆదివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఓ టెర్రరిస్టును మట్టుబెట్టినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని మునంద్ వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
Encounter underway in Munand area of Kulgam. Police and security forces at the spot. Details awaited: J&K Police
— ANI (@ANI) July 25, 2021
ఇదిలాఉంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేటినుంచి నాలుగు రోజులపాటు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి జమ్ముకశ్మీర్, లడఖ్‌లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఈ నెల 27న కాశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రసంగిస్తారు.
Also Read: