Krishna District: ప‌ద్దతి మార్చుకోకపోతే తాట తీస్తాం.. రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!

|

Aug 28, 2021 | 7:42 PM

కృష్ణాజిల్లా ఉయ్యురు మండలంలోని రౌడీ షీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతోన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మండలంలో ఆగడాలకు పాల్పడుతోన్న

Krishna District: ప‌ద్దతి మార్చుకోకపోతే తాట తీస్తాం.. రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!
Police
Follow us on

Rowdy sheeters: కృష్ణాజిల్లా ఉయ్యురు మండలంలోని రౌడీ షీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతోన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మండలంలో ఆగడాలకు పాల్పడుతోన్న రౌడీ మూకల్ని పోలీస్ స్టేషన్‌కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈస్ట్ జోన్ ఏసీపీ కె.విజయపాల్ ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ఉయ్యూరు టౌన్, రూరల్ మండలంలో రౌడీ షీట్ కలిగిన సుమారు 30 మంది అనుమానితులకు పోలీసులు హితబోధ చేశారు.

సరైన నడవడికతో ఉండాలని ఎలాంటి ఆసాంఘీక కార్యకలాపాలు చేయుద్దని హెచ్చరించారు. నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రౌడీషీటర్లంతా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండేలా ప్రతీ ఒక్కరూ ఆదివారం పోలీస్‌ స్టేషన్లో సంతకాలు చేసి వెళ్లాలని సూచించారు.

జీవించడానికి సదరు వ్యక్తులంతా ఏయే వృత్తుల్లో ఉన్నారు అనే విషయాలను నమోదు చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

అంతేకాకుండా చెడు వ్యసనాలకు బానిసలై కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని వారిపై కూడా చట్ట పరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యురు సీఐ ముక్తేశ్వరవు, టౌన్ ఎస్ఐ సత్య శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు.

Read also: పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దంటూ డయల్‌ 100 కి ఫోన్‌ చేసిన యువతి.. చివరి ట్విస్ట్ ఇంట్రెస్టింగ్