టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

|

Feb 11, 2021 | 7:28 AM

Kolkata Youth Missing: టీవీ ప్రోగ్రామ్‌లో వచ్చిన ఓ స్టంట్‌ను కాపీ చేయాలనుకున్న ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన పశ్చిమ...

టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
Kolkata Youth Missing
Follow us on

Kolkata Youth Missing: టీవీ ప్రోగ్రామ్‌లో వచ్చిన ఓ స్టంట్‌ను కాపీ చేయాలనుకున్న ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోల్‌కతాలోని విద్యాసాగర్ సేతు బ్రిడ్జి మీద నుంచి ఇద్దరి యువకులు హుగ్లీ నదిలోకి దూకారు. కలర్స్ టీవీలో వచ్చే ‘ఖత్రోం కా ఖిలాడీ’(Khatron Ke Khiladi) ప్రోగ్రామ్‌లో చూపించిన ఓ స్టంట్ చేయడం కోసం వీరిద్దరూ నదిలోకి దూకేశారట. దానిని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో కొంతమంది యువకులు వెల్‌కమ్ టూ ఖత్రోం కా ఖిలాడీ(Welcome To Khatron Ke Khiladi), అని అరుస్తుండటం.. మరికొందరు ఏమో ‘రాజా గో ఫాస్ట్’ అంటూ యువకులను ఉత్సాహపరిచారు.

ఇక నదిలోకి దూకిన ఇద్దరి యువకుల్లో ఒకరు కనిపించకుండా పోయాడు. ఇక మిస్ అయిన యువకుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. కనిపించకుండా పోయిన యువకుడి కోసం ప్రస్తుతం రివర్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..