పిల్లి సజీవ దహనం.. నిందితుడి వివరాలు చెబితే 50వేల నజరానా

మనషుల మీదనే కాదు.. మూగ జీవాలపై కర్కశంగా ప్రవర్తిస్తూ తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో ఘటనలు వెలుగులో రాగా..

పిల్లి సజీవ దహనం.. నిందితుడి వివరాలు చెబితే 50వేల నజరానా

Edited By:

Updated on: Jul 21, 2020 | 6:27 PM

మనషుల మీదనే కాదు.. మూగ జీవాలపై కర్కశంగా ప్రవర్తిస్తూ తమలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో ఘటనలు వెలుగులో రాగా.. తాజాగా బతికుండగానే ఓ పిల్లిని సజీవ దహనం చేసిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. లైటర్‌ని వెలిగించిన ఓ వ్యక్తి పిల్లి మీద వేయగా.. అది బాధను భరించలేక పరిగెత్తుతూ ఓ చోట కుప్పకూలి, మరణించింది. దీంతో ఈ ఘటనపై హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్‌ఎస్ఐ) స్పందించింది. ఈ ఘటనకు కారణమైన వ్యక్తి పేరు చెబితే రూ.50వేలు నజరానాగా ఇస్తామని ప్రకటించింది.

ఈ దుర్ఘటనపై హెచ్ఎస్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్‌ అలోక్‌పర్నా సేన్‌గుప్తా మాట్లాడుతూ.. ”బతికున్న ఒక చిన్న, అమాయకపు పిల్లిని మంటల్లో వేసి కాల్చేశారు. వారిలో కాస్త కూడా మానవత్వం లేదేమో. ఇప్పటికైనా మూగ జీవాలపై హింసను ఆపాలి. ఇలాంటి రాక్షసుల వలన ఇంకా ఎంత మంది మనుషులు, జంతువులు ఇబ్బంది పడాల్సి వస్తుందో. వెంటనే ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలి. దీనిపై సంబంధిత ఆధికారులను సంప్రదించి, దర్యాప్తు ప్రారంభం అయ్యేలా చేస్తాం” అని అన్నారు.

https://twitter.com/Saarthi_108/status/1284555250930610177