Cryptocurrency: ఇన్వెస్టర్ల వేధింపులు.. ప్రాణాలు తీసిన క్రిప్టో.. ఖమ్మం వాసి బలవన్మరణం..

|

Nov 25, 2021 | 8:22 AM

Khammam resident commits suicide: క్రిప్టో కరెన్సీ ప్రాణాలు తీస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.70 లక్షలు పోగొట్టుకొన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో

Cryptocurrency: ఇన్వెస్టర్ల వేధింపులు.. ప్రాణాలు తీసిన క్రిప్టో.. ఖమ్మం వాసి బలవన్మరణం..
Cryptocurrency
Follow us on

Khammam resident commits suicide: క్రిప్టో కరెన్సీ ప్రాణాలు తీస్తోంది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.70 లక్షలు పోగొట్టుకొన్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో ఓ లాడ్జిలో పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమీద రామలింగస్వామి (38) ఒకరి ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ క్రిప్టో యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో.. రూ.70లక్షలు అప్పులు అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు కారు లాక్కోని, చెక్కులపై సంతకాలు పెట్టించుకుని వేధించారు.

పెద్ద ఎత్తున డబ్బును పొగొట్టుకున్న రామలింగస్వామి ఈ నెల 22న సూర్యాపేట పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రామలింగస్వామి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తలుపులు పగులగొట్టి లోపల చూడగా.. రామలింగస్వామి బాత్‌రూమ్‌లో మృతి చెంది ఉన్నాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

క్రిప్టో నష్టాలతోనే చనిపోతున్నట్టు రామలింగస్వామి భార్యకు సూసైడ్ నోట్ రాసినట్లు పేర్కొన్నారు. రామలింగస్వామి భార్య, తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Crime News: దారుణం.. కన్నకూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత తల్లికి తెలియడంతో..

Visakhapatnam: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. త్రీటౌన్ సీఐ మృతి.. పెట్రోలింగ్ చేసి..