Kerala Drug Racket : సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చిక్కిన బోట్లు, రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తుండగా.. ఫసక్‌.!

|

Mar 25, 2021 | 4:47 PM

Kerala Drug Racket : కనీవినీ ఎరుగనంత స్థాయిలో భారీ డ్రగ్‌ రాకెట్‌ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ విచ్ఛిన్నం చేసింది. లక్షదీవుల..

Kerala Drug Racket : సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చిక్కిన బోట్లు, రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తుండగా.. ఫసక్‌.!
Drug Mafia
Follow us on

Kerala Drug Racket : కనీవినీ ఎరుగనంత స్థాయిలో భారీ డ్రగ్‌ రాకెట్‌ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ విచ్ఛిన్నం చేసింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌ మినికోయ్ దీవులగుండా భారత్‌లోకి డ్రగ్స్‌ను తరలిస్తున్న ఈ ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. వారి నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేశారు.

మార్చి 18న ఈ ఘటన జరగగా.. దానికి సంబంధించిన వివరాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు. శ్రీలంక ఫిషింగ్ బోట్ రవిహాన్సిలో 300 కిలోల హై-గ్రేడ్ హెరాయిన్, 1000 రౌండ్లతో కూడిన ఐదు, ఎకె -47 రైఫిల్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాదకద్రవ్యాల విలువ సుమారు రూ .3000 కోట్లు వరకూ ఉంటుందని అంచనా. మూడు పడవలతో పాటు 19 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేశారు. వీరందరినీ దర్యాప్తు కోసం కేరళలోని విజింజంకు తరలించారు.

కాగా, మార్చి 18న తెల్లవారుజామున ఎప్పటిలానే కోస్ట్ గార్డ్ సిబ్బంది అరేబియా సముద్రంలో గస్తీకి వెళ్లారు. ఐతే మినికోయ్ ద్వీపం సమీపంలో మూడు మత్స్యకారుల బోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అవి శ్రీలంకు చెందిన బోట్లు కావడంతో అనుమానించిన కోస్ట్‌గార్డ్ సిబ్బంది వాటిని వెంబడించారు. కోస్ట్ గార్డ్స్‌ను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఫైరింగ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అయినా చాకచక్యంతో కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంబడించి వారందరినీ పట్టుకుని భారీ స్థాయిలో ఉన్న అత్యంత నాణ్యమైన డ్రగ్స్,  ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ భారీ డ్రగ్ దందా మూలాలు ఏంటి.. ? ఈ రాకెంట్ వెనుక  ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

Read also : Bengal Assembly Election 2021 : ‘స్కీమ్‌ లు కావాలంటే మోదీజీకి.. స్కాములు కావాలంటే ఆమెకు ఓటెయ్యండి’ : అమిత్‌ షా