రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. సరిగ్గా వారం రోజులకే ఇంటి నుంచి భార్య మాయం.. చివరకు..

రోడ్డు ప్రమాదంలో భర్త మరణించిన వారం రోజులకే అతని భార్య ఇంటి నుంచి మాయమయ్యింది. ఆమె కోసం ఆమె కుటుంబీకులు, స్థానికులు గాలింపు చేపట్టారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చివరకు..

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. సరిగ్గా వారం రోజులకే ఇంటి నుంచి భార్య మాయం.. చివరకు..
Mithuna (22)

రోడ్డు ప్రమాదంలో భర్త మరణించిన వారం రోజులకే అతని భార్య ఇంటి నుంచి మాయమయ్యింది. చివరకు ఆమె నీటికుంటలో శవమై తేలింది. కేరళలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిథున(22), సూరజ్ ఏడు మాసాల క్రితం వివాహం  చేసుకున్నారు. ఇద్దరు ఎంతో అన్యోన్య జీవితాన్ని సాగిస్తున్నారు. తిరువల్లం నర్సింగ్ కాలేజీలో మిథున చదువుకుంటోంది. ఈ నెల 5న ఆమెను బైక్‌పై కాలేజీలో దింపి ఇంటికి తిరుగుపయనమయ్యాడు సూరజ్.  మిట్టతరా జాతీయ రహదారిపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన కారు..బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరజ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఇవాళ(ఆదివారం) వేకువజామున మిథున తన ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె కుటుంబీకులు, స్థానికులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం నుంచే గాలిస్తున్నారు. మిథున అదృశ్యంపై ఆమె కుటుంబీకులు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో సమీపంలోని ఓ నీటికుంటలో మిథున శవమై తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మిథున నీటికుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.  భర్త రోడ్డు ప్రమాదంలో మరణించిన వారం రోజులకే.. అతని భార్య కూడా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని పోలీసులు సూచిస్తున్నారు. జీవితంలో అనూహ్య విషాద ఘటనలకు క్రుంగిపోవద్దని సలహా ఇస్తున్నారు. అవసరమైతే మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

Also Read..

Bike Accident: ట్రిపుల్ రైడ్ చేస్తూ డివైడర్‌ను ఢికొట్టిన యువకులు.. ఇద్దరు స్పాట్ డెడ్.. మరొకరికి

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..

 

Click on your DTH Provider to Add TV9 Telugu