కర్ణాటక ముఖ్య నేత బంధువు దారుణ హత్య.. నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన దుండగులు..!
రావూరు అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాం స్థానికంగా సంచలనం రేపుతోంది. కీలక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Man murdered in Nellore district : నెల్లూరులో జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. రావూరు అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి లభించిన ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ బంధువు అయిన సిద్దార్ద్ సింగ్.. బెంగళూరులో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొద్దిరోజులు క్రితం సిద్దార్ద్ కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. అనుమానితులను విచారించగా హత్య చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా రావూరు ప్రాంతానికి చెందిన వినోద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వినోద్ ఇచ్చిన సమాచారం ప్రకారం సిద్దార్ద్ సింగ్‌ను హత్య చేసి నెల్లూరు జిల్లా రాపూరు వద్ద పెంచల కోన ప్రాంతంలో శవాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బెంగళూరు పోలీసులు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. నిందితుల సమక్షంలో ఈ మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు, రెవిన్యూ అధికారుల సమక్షంలో శవాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్యకు ప్రధానంగా ఆర్ధిక లావాదేవీల్లో విబేధాలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also... కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన