ప్రియుడిని కలిసేందుకు ఇంటికెళ్లిన బాలికపై కన్ను.. ఆ తర్వాత లవర్ తండ్రి ఏం చేశాడంటే..?

Crime News: బాలికలు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు నిర్భయ లాంటి చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా

ప్రియుడిని కలిసేందుకు ఇంటికెళ్లిన బాలికపై కన్ను.. ఆ తర్వాత లవర్ తండ్రి ఏం చేశాడంటే..?
Crime News

Updated on: Nov 11, 2021 | 11:31 AM

Crime News: బాలికలు, మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు నిర్భయ లాంటి చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కుమారుడు ప్రేమించిన మైనర్‌ బాలికపై.. బాలుడి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు బాళే హొన్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చిక్కమగళూరు బాలెహోన్నూరు పోలీసులు బుధవారం తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాళే హొన్నూరు స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. అయితే.. బుధవారం మైనర్ బాలిక తన కొడుకును కలిసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో తన కొడుకు బయటకు వెళ్లాడని, తిరిగి రావడానికి సమయం పడుతుందని ఆ వ్యక్తి బాలికకు చెప్పాడు. ఇంట్లో కాసేపు ఉండమని కోరాడు. సాయంత్రం కావడంతో బాలిక అక్కడే ఉంది. ఇదే అదునుగా భావించిన నిందితుడు చంద్రు బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో బాలిక తల్లి బాలెహోమ్మూరు పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Viral Video: మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!

Vijayawada: డీసీపీ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నం.. విజయవాడ సీపీకి దిశ ఎస్ఐ లేఖ

Loading...
Unable to load recommendations.
Follow Us