Kanpur IT Raid: హమ్మయ్య లెక్క తేలిందోచ్.. కట్టల గుట్టలు లెక్కించేందు మూడు రోజులు పట్టింది..

|

Dec 26, 2021 | 12:05 PM

Kanpur IT Raid: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే. కట్టల గుట్టలు చూసి అధికారులే షాకయ్యారు. అయితే.. పట్టుపబడిన

Kanpur IT Raid: హమ్మయ్య లెక్క తేలిందోచ్.. కట్టల గుట్టలు లెక్కించేందు మూడు రోజులు పట్టింది..
Kanpur It Raid
Follow us on

Kanpur IT Raid: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే. కట్టల గుట్టలు చూసి అధికారులే షాకయ్యారు. అయితే.. పట్టుపబడిన నగదు లెక్కించడానికి దాదాపు మూడు రోజుల సమయం పట్టింది. ఈ సోదాల్లో మొత్తం 178 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్‌కు చెందిన ఫ్రాగ్రాన్స్ కంపెనీ ప్రమోటర్ పీయూష్ జైన్ ఇంట్లో మొత్తం రూ.177.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిన్న అర్థరాత్రి నగదు లెక్కింపు పూర్తయినట్లు వెల్లడించారు. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) అపెక్స్ బాడీ సోదాలు నిర్వహిస్తోంది. చరిత్రలో పట్టుబడిన భారీ నగదు ఇదేనంటూ అధికార వర్గాలు తెలిపాయి.

శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారులైన కాన్పూర్‌లోని త్రిమూర్తి ఫ్రాగ్రన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై DGGI అహ్మదాబాద్ యూనిట్ శోధన ఇంకా కొనసాగుతోందని, దర్యాప్తులో ఉన్న పార్టీల పన్ను ఎగవేతను ఏజెన్సీ మూల్యాంకనం చేస్తోందని అధికారులు తెలిపారు. పారిశ్రామికవేత్తల ప్రాంగణంలో జరిగిన దాడుల్లో లెక్కల్లో చూపని కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, కాన్పూర్ మరియు కన్నౌజ్‌లలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని అధికారి తెలిపారు. అయితే.. రికవరీ చేసిన నగదు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) చట్టంలోని సెక్షన్ 67 నిబంధనల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం.

పట్టుబడిన కరెన్సీలో ఎక్కువ భాగం రూ. 500 నోట్లు, రూ. 2000 నోట్లు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రికవరీ చేసిన నగదు అమ్మకాల ప్రక్రియలో భాగమని.. ప్రాంగణంలో రహస్యంగా ఇంకా డబ్బు ఉన్నట్లు తెలిపాయి. ‘పాన్ మసాలా కంపెనీ భారీ పన్ను ఎగవేతకు పాల్పడి.. అక్రమంగా సంపాదించినట్లు పేర్కొంటున్నారు. ట్రాన్స్‌పోర్టర్ ఆవరణలో కూడా డబ్బు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పన్నుల ఎగవేత, నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేస్తున్నట్లు ట్రాన్స్‌పోర్టర్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. నగదు రూపంలోనే వస్తువుల విక్రయాలు జరుగుతున్నట్లు అంగీకరించాడన్నారు. డీజీజీఐ( డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌) అధికారులు పీయూష్‌ ఇంటితో పాటు.. మహారాష్ట్ర, గుజరాత్‌లోని పలు కార్యాలయాలు, గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అఖిలేష్‌కు అత్యంత సన్నిహితుడు..
పీయూష్‌ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ అనుచరుడిగా ఉన్నారు. ఆపార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీతో ప్రత్యేకంగా ఓ పర్ఫ్యూమ్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు పీయూష్‌. కాగా పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలను బీజేపీ సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే.

Also Read:

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. హాస్టల్‌ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం.. 

Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..