Kadapa District: బాలుడి హత్య.. నరబలి కోణంలో విచారణ.. తాజాగా పోలీసులకు మరో క్లూ

|

Aug 11, 2021 | 5:20 PM

కడప జిల్లా వెంగలాయపల్లెలో 9 ఏళ్ల బాలుడి హత్యపై మిస్టరీ వీడుతున్నట్లే ఉంది. బాలుడ్ని క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా అన్న...

Kadapa District: బాలుడి హత్య.. నరబలి కోణంలో విచారణ.. తాజాగా పోలీసులకు మరో క్లూ
Kadapa District Boy Murder
Follow us on

కడప జిల్లా వెంగలాయపల్లెలో 9 ఏళ్ల బాలుడి హత్యపై మిస్టరీ వీడుతున్నట్లే ఉంది. బాలుడ్ని క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ కేసులో అమర్నాథ్‌ రెడ్డి, దస్తగిరి అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఇది క్షద్రపూజలకు సంబంధించిన మ్యాటర్‌గా అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి. చనిపోయిన బాబు పేరు తనీష్‌. కేవలం 9ఏళ్ల వయసు. ముద్దుగా ఉండేవాడు. గత శనివారం అంటే.. ఏడో తేదీన కనిపించకుండా పోయాడు. అతని కోసం ఊరు ఊరంతా గాలించారు పేరెంట్స్‌. బాబు అయితే కనిపించలేదుగానీ.. అతన్ని వదిలిపెట్టాలంటే 8లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఓ లేఖ మాత్రం స్థానికులకు దొరికింది. ఒక్కసారిగా ఏంటి కిడ్నాప్, లేఖ రాసిన వాళ్లు ఎవరు.. ఎక్కడున్నారు.. సొంతూరి వాళ్లా కాదా అని ఆరాతీస్తూ, డబ్బు పోగేసుకున్న ప్రయత్నంలో ఉన్న పేరెంట్స్‌కి సోమవారం, మరో సీన్ కనిపించింది. గ్రామంలోనే అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో తనీష్‌ చనిపోయి ఉన్నాడు.. !

వారం క్రితం ఊళ్లోకి ఎవరెవరో వచ్చారు. గుత్తి అని కొందరికి, అనంతపురం అని మరికొందరికి చెప్పారు. ఆంజనేయస్వామి గుడి కడుతున్నాం విరాళాలు ఇవ్వండీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనీష్ వాళ్ల ఇంటికీ వచ్చారు. 50రూపాయల చందా, బియ్యం తీసుకున్నారు. ముద్దుగా ఉన్న తనీష్‌తో కాసేపు ముచ్చటించారు. బాబు జాకతం చూసి వెళ్లారు. అంతే.. ఆ తర్వాత 4రోజులకు ఆదివారం, అమావాస్యకు ముందు రోజు తనీష్‌ అదృశ్యం, అమావాస్య మర్నాడు డెడ్‌బాడీ. ఇది క్షద్ర పూజలు కాక ఇంకేంటి.. ! ఇదే అనుమానం ఆ పేరెంట్స్‌ది.

ఇదంతా ఒక వెర్షన్‌. ఇంతకీ క్షుద్రపూజలో కాదో గానీ, మొత్తంగా అమర్నాథ్‌రెడ్డి, దస్తగిరి అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 8లక్షలు కావాలంటూ రాసిన లేఖపై చేతి రాను పోల్చిచూస్తే ఈ ఇద్దరిలో ఒకరి చేతిరాతతో సరిపోలింది. అమర్నాథ్‌రెడ్డి భార్యకి, హత్యకు గురైన తనీష్‌ తల్లి శోభకు మధ్య కొన్ని నెలలుగా గొడవలున్నట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య వివాదంతోనే హత్యకు పాల్పడ్డారా అన్నది ఈ హత్యలో మరో కోణంగా కనిపిస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ హత్య కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:వాటే సారె.. ‘సరిలేరు మీకెవ్వరూ..!’.. మరోసారి హాట్‌టాపిక్‌గా తోట, బత్తుల వార్ల కావిళ్ళు

 ఏపీలో కొత్తగా 1869 కరోనా కేసులు.. ఆ జిల్లాలో కలవరపెడుతున్న మరణాలు