Case on Oracle India Head: ప్రముఖ కంపెనీలో కీల‌క ఉద్యోగి.. ల‌క్షల్లో వేత‌నం.. అయినా ఆయన చూపు అక్రమ సంపాద‌న‌పైనే!

|

Jun 15, 2021 | 6:19 PM

ల‌క్షల్లో వేత‌నం.. విలాసవంత‌మైన జీవితం.. ఇవ‌న్నీ ఉన్న అయ‌న చూపు మాత్రం అక్రమ సంపాద‌న‌పై ప‌డింది. త‌న వ‌క్రబుద్దితో అమాయకుల‌ను మోసం చేసి కోట్ల రూపాయలు వ‌సూలు చేశాడు.

Case on Oracle India Head: ప్రముఖ కంపెనీలో కీల‌క ఉద్యోగి.. ల‌క్షల్లో వేత‌నం.. అయినా ఆయన చూపు అక్రమ సంపాద‌న‌పైనే!
Cheating Case Against Oracle India Head
Follow us on

Cheating Case Against Oracle India Head: అయ‌న ఓ ప్రముఖ కంపెనీలో ప‌ని చేసే కీల‌క ఉద్యోగి. ల‌క్షల్లో వేత‌నం.. విలాసవంత‌మైన జీవితం.. ఇవ‌న్నీ ఉన్న అయ‌న చూపు మాత్రం అక్రమ సంపాద‌న‌పై ప‌డింది. త‌న వ‌క్రబుద్దితో అమాయకుల‌ను మోసం చేసి కోట్ల రూపాయలు వ‌సూలు చేశాడు. అంతేకాదు, త‌న మాయమాట‌లతో మ‌హిళ‌ల‌ను బుట్టులో వేసుకొని లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడు. రోజు రోజుకు ఈయ‌న ఆగడాలు పెరిగిపోవ‌డంతో బాధితులు పోలీసుల‌ను అశ్రయించారు.

ఒరాకిల్ ఇండియా హెడ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకటనల పేరుతో డబ్బులు దండుకుంటున్నారంటూ ఒరాకిల్ ఇండియా హెడ్ ప్రదీప్ అగర్వాల్ దంపతులపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మాయమాటలతో కోట్ల రూపాయ‌లు కుచ్చుటోపి పెడుతున్నట్లు పోలీసులు ఫిర్యాదులు అందుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒరాకిల్ ఇండియా హెడ్‌గా పనిచేస్తున్న ప్రదీప్ అగర్వాల్.. వెబ్ సైట్స్‌లో యాడ్స్ చూపించి ప్రాజెక్టుల పేరుతో అతని భార్య మీరూ అగర్వాల్‌తో కలిసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్స్ చేయాలని క్లయింట్ల‌పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అంతేగాక పేమెంట్ చేయని క్లయింట్లపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అతని భార్య మీరూ అగర్వాల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు.

ఎంఏడీఎస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ సైట్‌లు ప్రారంభించి లేని ప్రాజెక్ట్ పేరుతో క్లయింట్‌లకు అగర్వాల్ దంపతులు ఎర వేశారు. ఈ త‌ర‌హ మోసాల‌తో విసిగిపోయ‌న బాధితులు పోలీసుల‌ను అశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రదీప్ అగర్వాల్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18లోపు తమ ఎదుట విచార‌ణ‌కు హాజరు కావాలని నోటిసులు జారీ చేశారు. ఓ ప్రముఖ కంపెనీకి హెడ్ కావ‌డంతో చాలా మంది న‌మ్మి ల‌క్షల్లో డిపాజిట్ చేశారు. దీంతో పోలీసులు ఈ వ్యవ‌హ‌రంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Read Also…. Cristiano Ronaldo: ఈ సాఫ్ట్ డ్రింక్ వద్దు.. మంచినీరు తాగండి..! క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన..!