అయోధ్య మందిరంపై వివాదాస్పద కామెంట్స్‌.. జర్నలిస్ట్‌ అరెస్ట్

| Edited By:

Aug 18, 2020 | 11:36 PM

యూపీకి చెందిన ఓ యువ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధిచి సోషల్ మీడియాలో మార్ఫింగ్‌ ఫోటులు పెట్టారన్న ఆరోపణలు..

అయోధ్య మందిరంపై వివాదాస్పద కామెంట్స్‌.. జర్నలిస్ట్‌ అరెస్ట్
Follow us on

యూపీకి చెందిన ఓ యువ జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధిచి సోషల్ మీడియాలో మార్ఫింగ్‌ ఫోటులు పెట్టారన్న ఆరోపణలు రావడంతో..మంగళవారం ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి యూపీ పోలీసులు తీసుకెళ్లారు. సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదయ్యింది.

కనోజియా వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచేలా హిందూ ఆర్మీ నాయకుడు సుశీల్ తివారీ చేసిన ఓ పోస్టును మార్ఫింగ్‌ చేసి.. ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ వివాదాస్పదంగా మారడంతో ఆయనపై హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలావుంటే.. గతంలో కూడా కనోజియా ఇలాంటి వివాదాస్పద పోస్టులు చేసేవాడని తెలుస్తోంది. 2019 లో కూడా యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ను ఓ మహిళ పెండ్లి చేసుకుంటానంటుందంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అప్పట్లో కూడా కనోజియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు