ACB Attack : ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ జగిత్యాల ఎస్ఐ శివ కృష్ణ

ప్రజల సొమ్ములతో పుష్కలంగా జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు అక్రమ ప్రభుత్వ ఉద్యోగులు తరచూ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నా..

ACB Attack : ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ జగిత్యాల ఎస్ఐ శివ కృష్ణ
Si Sivakrishna

Updated on: Jun 18, 2021 | 12:04 AM

Jagityal city Sub Inspector Shiva Krishna arrest : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ దాడులు జరిగాయి. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. గత నెలలో నమోదైన ఐపీసీ 498 కేసుకు సంబంధించి అప్పటి ఎస్ ఐ శంకర్ నాయక్ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగా అదే కేసు విషయమై ప్రస్తుత జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ నిందితుల నుండి 50 000 లంచం డిమాండ్ చేయడంతో సదరు నిందితులు 30 000 తీసుకొని ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి 30 000 లంచం తీసుకుంటుండగా ఎస్ ఐ శివ కృష్ణ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

ప్రజల సొమ్ములతో పుష్కలంగా జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు అక్రమ ప్రభుత్వ ఉద్యోగులు తరచూ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు పరివర్తన రాకపోవడం విశేషం.

Read also : Lady Doctor performed funeral : ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు