IT Raids: తమిళనాడులో ఐటీ రైడ్స్.. బయటపడిన వేయి కోట్ల అక్రమాస్తులు.. ఎక్కడెక్కడ దాడులు జరిపారంటే..?
Tamil Nadu - Income Tax Department: ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఒక్కసారిగా వేయి కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో అధికారులే..
Tamil Nadu – Income Tax Department: ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఒక్కసారిగా వేయి కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో అధికారులే ఆశ్యర్యం వ్యక్తంచేశారు. ఈ దాడులు తమిళనాడులో గురువారం జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఐటీ అధికారులు తెలిపారు. బులియన్ ట్రేడర్, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జువెలరీ రిటెయిలర్‌పై జరిగిన ఈ దాడుల్లో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా అక్రమాస్తులు లభించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది. తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడటం ఇప్పుడు పలు ఊహాగానాలకు తావిస్తున్నాయి.
ఈ వివరాలను స్వయంగా వెల్లడించిన సీబీడీటీ.. ఎవరిపై దాడులు జరిగాయన్న విషయం మాత్రం చెప్పకపోవడం గమనార్హం. అయితే దాడులు.. మార్చి 4న చెన్నై, ముంబై, కోయంబత్తూర్, మదురై, తిరుచిరాపల్లి, త్రిసూర్, నెల్లూరు, జైపూర్, ఇండోర్‌లలో ఏక కాలంలో 27 చోట్ల జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో లెక్కలు లేని రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు మూడు రోజుల వరకూ జరిగిన దాడుల్లో మొత్తం వెయ్యి కోట్లకు పైగా అక్రమ సంపాద బయటపడినట్లు సీబీడీటీ పేర్కొంది.
ఇదిలాఉంటే.. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో 234 స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే.. బీజేపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. దీంతోపాటు డీఎంకే.. కాంగ్రెస్ మధ్య కూడా సీట్ల పంపకం పూర్తయింది. నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
Also Read: