Student Kidnap: డ్రామాలు ఆడుతున్నాడా..! నిజమేనా..! ప్రకాశం జిల్లాలో మిస్టరీగా మారిన విద్యార్థి కిడ్నాప్..

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టి..లక్ష రూపాయలు అప్పు చేశాను. ఇంట్లో డబ్బులు అడిగితే తిడతారు. అందుకే కనిపించకుండా పోయా..

Student Kidnap: డ్రామాలు ఆడుతున్నాడా..! నిజమేనా..! ప్రకాశం జిల్లాలో మిస్టరీగా మారిన విద్యార్థి కిడ్నాప్..
Inter Student Kidnap

Updated on: Dec 09, 2021 | 9:43 AM

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టి..లక్ష రూపాయలు అప్పు చేశాను. ఇంట్లో డబ్బులు అడిగితే తిడతారు. అందుకే కనిపించకుండా పోయా. ప్రకాశం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి స్టూడెంట్ వాట్సాప్‌ల్లో ఫ్రెండ్స్‌కు పంపిన మేసేజ్‌లు ఇవి. అయితే స్టూడెంట్ ఒకడే ఈ డ్రామాలు ఆడుతున్నాడా? అతనికి ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఇడుపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థ నాసర్‌ వలీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ కేసును మొదట పోలీసులు లైట్‌గా తీసుకున్నారు. రాత్రి వరకూ కూడా రాకపోవడంతో విచారణ ప్రారంభించారు. వలీ ఫ్రెండ్స్‌ను విచారిస్తే అసలు సంగతి తెలిసింది.

తనని కిడ్నాప్‌ చేశారని.. లక్ష రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని ఫ్రెండ్స్‌ వాట్సాప్‌లకు మేసేజ్‌లు వచ్చాయి. విద్యార్థి అప్పులు చేసి కిడ్నాప్‌కు గురైనట్లు డ్రామా ఆడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..