Chittoor district: పోలీసులం అంటూ ఇన్నోవా ఆపారు, తనిఖీలు అంటూ అందర్నీ దింపారు.. కట్ చేస్తే

|

Jul 26, 2021 | 10:26 AM

మార్గం ఏదైనా మోసం చేయడమే వారి టార్గెట్. రద్దీ తక్కువగా ఉండే రోడ్లను చూస్తారు. అదును చూసి వారి ఫేక్‌ ప్రతిభ చూపిస్తారు. అందినకాడికి...

Chittoor district: పోలీసులం అంటూ ఇన్నోవా ఆపారు, తనిఖీలు అంటూ అందర్నీ దింపారు.. కట్ చేస్తే
Innova car theft
Follow us on

మార్గం ఏదైనా మోసం చేయడమే వారి టార్గెట్. రద్దీ తక్కువగా ఉండే రోడ్లను చూస్తారు. అదును చూసి వారి ఫేక్‌ ప్రతిభ చూపిస్తారు. అందినకాడికి దోచేస్తారు. ఇది ఆ ఫేక్‌ పోలీసుల స్టైల్. తనిఖీల పేరుతో వాహనాలను ఆపుతున్న నకిలీ పోలీసులు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఫేక్‌ పోలీసులను స్థానికులు పట్టుకొని, స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఫేక్‌గాళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు చేసిన మోసాలపై విచారణ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం పుదుపేటకు చెందిన 9 మంది భక్తులు బోయకొండ అమ్మవారి దర్శనానికి ఇన్నోవా వాహనంలో వెళ్లారు. అమ్మవారిని దర్శించుకొని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో కుప్పం మండలం పెద్దబంగానత్తం వద్ద రోడ్డుపై వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అయితే అక్కడుతున్నది ఫేక్ పోలీసులనీ పాపం ఈ తమిళనాడు భక్తులకు తెలియదు. వీరి వాహనాన్ని ఆపి తనిఖీలు చేయాలని చెప్పారు. భక్తులను వాహనం నుంచి దింపేసి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని వాహనంతో ఉడాయించారు.

దీంతో ఆ భక్తులు అసలు విషయం తెలుసుకొని లబోదిబోమన్నారు. అయితే ఆ ఫేక్‌ పోలీసుల్లో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. కొంత మర్యాద చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నకిలీ గ్యాంగ్‌ కర్ణాటకలోని బేతమంగళంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల నకిలీ పోలీసుల సంస్కృతి పెరగడం ఆందోళన కలిగించే అంశం. అమాయకులను మోసం చేయడమే టార్గెట్‌గా ఫేక్‌గాళ్లు పుట్టుకొస్తున్నారు. రియల్‌ పోలీసులు ఎవరో, ఫేక్‌ పోలీసులు ఎవరో తెలియక ప్రజలు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ

జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి పెరిగిన హీట్.. అగ్గి ఎక్కడ రాజుకుందంటే..?