రియల్ ఎస్టేట్ లావాదేవీల వెనుక బ్లాక్‌మనీ ఉంటోందా? యాదగిరి గుట్టలో ఇటీవల జరిగిన ఐటీ సోదాలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. 700 కోట్ల రూపాయలకు లెక్కలు చూపలేదని స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఐటీ విభాగం సేకరించినట్టు తెలిపింది. ఐటీ సోదాల్లో 11 కోట్ల 88 లక్షల రూపాయల నగదుతో పాటు… సుమారు 2 కోట్ల రూపాయలు విలువచేసే బంగారం సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాదాద్రిని డెవలప్ చేస్తోంది.
యాదగిరి ఆలయ నిర్మాణం కూడా తుదిదశకు చేరింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపత్యంలో యాదగిరి గుట్ట చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఆ లావాదేవీల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి.
వాటిని నిఘా పెట్టిన ఐటీ శాఖ.. పలు సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. లెక్కలు చూపని 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. 11 కోట్ల 88 లక్షల నగదు… సుమారు 2 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశామని చెప్పారు.
ఇవి కూడా చదవండి : Most Changes From April 1st : మీకు తెలియకుండానే మీ జీవితం ఈ మార్పులతో మొదలైంది.. అవేంటో తెలుసా..
Bengal Assembly Election 2021 Phase-2 Voting LIVE: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న నందిగ్రామ్ రచ్చ..