Hyderabad: ఘరానా మోసం.. ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ చేయిస్తానన్న దొంగబాబా.. 80వేలు సమర్పించుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్..

|

Sep 08, 2021 | 6:08 AM

Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు దొంగ బాబాను నమ్ముకున్న మహిళ.. చివరికి దారుణంగా మోసపోయింది.

Hyderabad: ఘరానా మోసం.. ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ చేయిస్తానన్న దొంగబాబా.. 80వేలు సమర్పించుకున్న ఎంబీబీఎస్ స్టూడెంట్..
Indian Doctors
Follow us on

Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు దొంగ బాబాను నమ్ముకున్న మహిళ.. చివరికి దారుణంగా మోసపోయింది. వేలాది రూపాయలు ఆ దొంగ బాబాకు సమర్పించుకుంది. చివరికి ఎలాంటి రెస్పాండ్స్ లేకపోవడంతో బాధిత మహిళ గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ(28) ఎంబీబీఎస్ పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఎంట్రెన్స్ టెస్ట్‌లు రాసింది. ఎందులోనూ ఆమె సెలక్ట్ అవ్వడలేదు. ఈ క్రమంలోనే బాధిత మహిళ సోదరి తన ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తుండగా.. బిశ్వజీత్ జా అనే స్వామీజీ పోస్ట్ కనిపించింది. పూజలు చేస్తే ఎలాంటి పరీక్షలు అయినా పాస్ అవ్వొచ్చని, జీవితంలో సెట్ అయిపోవచ్చని ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్ట్‌ను నమ్మిన మహిళ.. స్వామీజీని ఫేస్ బుక్ ద్వారానే కాంటాక్ట్ అయ్యింది. తన సోదరికి సంబంధించిన వివరాలన్నీ బాబాకు వివరించింది.

అయితే, దీన్నే అదునుగా భావించి దొంగ బాబా.. జాతక దోషాలు ఉన్నాయని, అందుకే పరీక్షలో విజయం సాధించలేకపోతుందని చెప్పుకొచ్చాడు. ఆమె స్వామీజీకి బాధితురాలి ఫోన్‌నెంబర్‌ ఇవ్వగా.. స్వామీజీ శిష్యులు రంగంలోకి దిగారు. ఆన్‌లైన్‌ వేదికగా బాధితురాలి పూర్తివివరాలు తెలుసుకున్నారు. అనంతరం పరీక్షలో పాస్‌ కావాలంటే పూజలు చేయాలని, అందుకు కొంత ఖర్చువుతుందని స్వామీజీ చెప్పాడు. అది నమ్మిన బాధితురాలు.. పలుమార్లు అతడి ఖాతాలో రూ.80 వేల దాకా జమ చేసింది. స్వామీజీకి మొదటి సారి 21,900 రూపాయలు ఆన్‌లైన్‌లో పంపిన తరువాత 2020 డిసెంబర్‌లో ఫారిన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు రాసింది. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేదు. ఇదేంటి అని స్వామీజీని అడిగితే.. పూజలో ఏదోలోపం జరిగి ఉంటుందని, ఈ సారి కాలభైరవ ప్రత్యేక పూజ చేద్దామని నమ్మబలికాడు. ఈ పూజ కోసం బాధితురాలి నుంచి రూ.14వేలు, రూ.8వేలు ఇలా పలు మార్లు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. ఈ ఏడాది కూడా బాధిత మహిళ పరీక్ష పాస్‌కాలేదు. దాంతో.. బాధిత మహిళ స్వామీజీని నిలదీసింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో తాను మోసపోయానని గుర్తించిన బాధిత మహిళ.. గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

Also read:

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు..

Praja Sangrama Yatra: తెలంగాణలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ పనే చేస్తాం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..

Indian Cricketers: పెళ్లైన మహిళలను వివాహమాడిన క్రికెట్ ప్లేయర్లు వీరే.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..