Illegal Arms Licensing case: ఢిల్లీ సహా జమ్మూ కశ్మీర్‌లోని 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తుపాకీ లైసెన్స్‌లను అక్రమంగా విక్రయించిన కేసులో జమ్మూ కశ్మీర్ ఐఏఎస్ అధికారి షహీద్ ఇఖ్బాల్ చౌధురితో పాటు మరికొందరి ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. షహీద్ ఇక్బాల్ ప్రస్తుతం గిరిజన వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కథువా, రేశాయ్, రాజోరీ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనరుగా పనిచేసినన షహీద్ ఇక్బాల్.. నకిలీ పేర్లతో ఇతర రాష్ట్రాలు, పలువురు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేశారు.
చౌదరి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనతో పాటు పలువురు అధికారుల ఇళ్లపై సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడి చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, కథువా, రియాసి, రాజౌరి, ఉధంపూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌గా చౌదరి పనిచేశారు. ఈ కాలంలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నకిలీ పేర్లలో వేలాది తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి. తుపాకీ లైసెన్స్‌ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎనిమిది మంది మాజీ డిప్యూటీ కమిషనర్లను కూడా సీబీఐ విచారిస్తున్నది.
ఇదిలావుంటే, రాజస్థాన్ ఏటీఎస్ ఈ కుంభకోణాన్ని 2017 లో బయటకు తీసి 50 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది. ఆర్టీ సిబ్బంది పేరిట 3 వేలకు పైగా పర్మిట్లు ఇచ్చినట్లు ఏటీఎస్ తేల్చింది. అనంతరం, అప్పటి జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.
Read Also…