GHMC: వనస్థలిపురంలో విషాదం.. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికుల గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!

|

Aug 04, 2021 | 6:40 AM

హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు GHMC ఔట్ సోర్సింగ్ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన వనస్థలిపురం పరిధిలో జరిగింది.

GHMC: వనస్థలిపురంలో విషాదం.. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికుల గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!
Ghmc Workers
Follow us on

GHMC Workers: హైదరాబాద్ మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు GHMC ఔట్ సోర్సింగ్ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన వనస్థలిపురం పరిధిలో జరిగింది. సాహెబ్‌నగర్‌‌లో డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగిన అంతయ్య, శివ అనే ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. మ్యాన్ హోల్ క్లీనింగ్ చేసేందుకు లోపలికి దిగిన వ్యక్తులు ఊరిరాడక అందులోనే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ నుంచి ఒకరి మృతిదేహాన్ని వెలుపలికి తీశారు. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతులు చంపాపేట్, సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వారని, పారిశుధ్య పనులతోనే జీవనోపాధి పొందేవారని కుటంబసభ్యులు వాపోతున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్‌లోకి దిగటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి వేళలో ఇటువంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వీరి కుటుంబాలకు పరిహారం అందించాలని స్థానిక కార్పొరేటర్ డిమాండ్ చేశారు.

Read Also… AP Inter Exams: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే!

Airtel: ఎయిర్‌టెల్‌కు పెరిగిన ఆదాయం.. జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభం..!