Hyderabad: యువతులను రప్పించి.. హోటల్‌‌లో గుట్టుగా వ్యభిచారం.. ఆ తర్వాత ఏమైందంటే?

Hyderabad Police: ఓ మహిళ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కింది.. అనంతరం ప్లాన్ వేసి ఓ హోటల్‌లో రూం అద్దెకు తీసుకొని.. వ్యభిచారం మొదలుపెట్టింది. పలు ప్రాంతాలకు

Hyderabad: యువతులను రప్పించి.. హోటల్‌‌లో గుట్టుగా వ్యభిచారం.. ఆ తర్వాత ఏమైందంటే?
prostitution

Edited By:

Updated on: Jul 18, 2021 | 1:07 PM

Hyderabad Police: ఓ మహిళ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కింది.. అనంతరం ప్లాన్ వేసి ఓ హోటల్‌లో రూం అద్దెకు తీసుకొని.. వ్యభిచారం మొదలుపెట్టింది. పలు ప్రాంతాలకు చెందిన సెక్స్ వర్కర్లను రప్పించి.. వారికి వచ్చే ఆదాయంలో సగం సంపాదిస్తూ పోలీసులకు చిక్కింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కడపల్లిలోని సాయికృప హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడులు చేసి అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో మేనేజర్‌ బి.ఉషశ్రీ (22) సహా హోటల్‌లో హౌస్‌కీపర్లుగా పని చేస్తున్న శ్రీకాంత్‌ (24), సాయికుమార్‌(23)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన సెల్‌ఫోన్లు, నిరోధ్‌ ప్యాకెట్లు, రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించేందుకు సూర్యాపేటకు చెందిన ఉషశ్రీ సాయికృప హోటల్‌లోని 205 నంబర్‌ గదిని అద్దెకు తీసుకుంది. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన సెక్స్‌వర్కర్లను రప్పించి వారికి వచ్చే ఆదాయంలో సగం షేరింగ్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. ఆమెకు హోటల్‌లో హౌస్‌ కీపింగ్‌ చేస్తున్న సిద్ధిపేటకు చెందిన శ్రీకాంత్, నల్గొండకు చెందిన సాయికుమార్‌ సహకరించేవారు. కాగా.. మధ్యవర్తులుగా పనిచేస్తున్న విష్ణు, ధర్మా పరారీలో ఉన్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

Also Read:

Monkey Viral Video: ఈ పిల్ల కోతి ఐడియానే వేరప్ప.. జీవితంలో ఎదగాలన్నా.. ఎగరాలన్నా ఇలా చేయండి

బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఐఏఎస్ అధికారి పోలీసు కంప్లయింట్…ఫోర్జరీ చేశారని ఆరోపణ

Loading...
Unable to load recommendations.
Follow Us