Ganja Smuggling: గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 4.4 క్వింటాళ్లు సీజ్.. నలుగురు అరెస్ట్

|

Sep 03, 2021 | 9:21 AM

గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

Ganja Smuggling: గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 4.4 క్వింటాళ్లు సీజ్.. నలుగురు అరెస్ట్
Ganja Smugglers Arrest
Follow us on

Ganja Smugglers Arrest: గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో గాంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగున్నర క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు కారులో గంజాయి తరలిస్తున్న ఓ ముఠాలోని నలుగురు వ్యక్తులను చాంద్రాయణగుట్ట పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చాంద్రాయణగుట్ట ఇన్స్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్​ అజర్ ఆలీ​(36), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ మజర్ ఆలీ(32), యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్(40), శంషాబాద్‌కు చెందిన షేక్​అష్రఫ్​పాషా(24)లు టిఎస్​07 జిఎ 2390 నెంబర్​గల మహేంద్ర ఎక్స్‌యువీ కారులో ఈ నెల 2వ వతేదీన తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి నాందేడ్​కు గంజాయిని తరలిస్తున్నారు. మార్గమధ్యలో నల్లవాగు దగ్గర కారు ఆగిఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు దాడి చేసి, కారును తనిఖీ చేశారు. దీంతో 8 సంచుల్లో నాలుగు క్వింటాళ్ల 400 కిలోల గంజాయిని పోలీసులు రెడ్​ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహ్మద్​ అజర్​ ఆలీ​ , మహ్మద్​ మజర్​ ఆలీ, మహ్మద్​ ఫిరోజ్, షేక్​ అష్రఫ్​ పాషాఅను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవలే తెలంగాణ పోలీసులకు గంజాయి డాన్ షిండే ఎన్సీబీ అధికారులకు చిక్కాడు. ఎన్సీబీ అధికారులు షిండేను అరెస్టు చేశారు. గతంలో కూడా అరెస్టయిన షిండే తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం దేశంలో ఆరు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతను ఎన్సీబికి చిక్కాడు. షిండే దక్షిణాది నుంచి ఉత్తరాదికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాదు మీదుగా ముంబై, ఢిల్లీలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు.

బెంగళూరు ఎన్సీబీ అధికారులు హైదరాబాదులోని సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడంతో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఐదు రోజుల క్రితం హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజ్ వద్ద అధికారులు రూ.21 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గన్నీ బ్యాగుల్లో గంజాయిని నింపి, దానిపై కప్పు వేసి, ఆపైన మెక్కలను లోడ్ చేశారు. దీంతో గంజాయి గురించి అనుమానం రాదని వారు భావించారు. అయితే ఎన్సీబీ సిబ్బంది చకచక్యంగా వ్యవహరించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు గంజాయి డాన్ షిండే‌ను అదుపులోకి తీసుకున్నారు.

షిండే అతి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. షిండేకు సహకరిస్తున్నవారిపై నిఘా పెట్టి, షిండేను అరెస్టు చేయగలిగారు.

— నూర్ మహమ్మద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్

Read Also…  Warangal Murder: వరంగల్ జిల్లాలో దారుణం.. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి.. గొంతులో పొడిచి చంపిన దుండగులు