Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

|

Sep 11, 2021 | 10:11 AM

Hyderabad Police: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా

Crime news: సైదాబాద్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..
Arrest
Follow us on

Hyderabad Police: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. యాదాద్రి జిల్లాలోని రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడు రాజును అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ వెల్లడించారు. నగరంలోని సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక.. పక్కనే ఉన్న రాజు ఇంట్లో అనుమానాస్పద రీతిలో గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. బాలికను తీసుకెళ్లిన రాజు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసి పరారయ్యాడు. అనంతరం తూర్పు మండలం డీసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.

ఇదే ప్రాంతంలో జులాయిగా తిరుగుతున్నా నిందితుడు రాజు గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో మూటకట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు బాలిక కోసం వెతకగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి రాజు ఇంటిని పరిశీలించగా బాలిక శవమై కనిపించింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన రాజును కాల్చి చంపాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాలిక మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పోలీసు అధికారులు, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని హామీఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.

Also Read:

Crime News: చెల్లిని దారుణంగా చంపిన అన్న.. వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని.. తుపాకీతో..

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. ఎంఎన్ఎంకే పార్టీ ముఖ్య నేత దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి..