Hyderabad Crime News: నీట్ కోచింగ్ కోసం ఆల‌యాల్లో దొంగ‌త‌నాలు.. అత‌డి వెర్ష‌న్ విని పోలీసుల మైండ్ బ్లాంక్

|

May 22, 2021 | 4:50 PM

డాక్ట‌ర్ అవ్వాల‌న్న‌ది అత‌డి కోరిక‌. అది అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. టాలెంట్‌తో పాటు కాసింత గ‌ట్టిగానే డ‌బ్బులు కావాలి. దీంతో హైద‌రాబాద్ సిటీకి వచ్చేశాడు.

Hyderabad Crime News: నీట్ కోచింగ్ కోసం ఆల‌యాల్లో దొంగ‌త‌నాలు.. అత‌డి వెర్ష‌న్ విని పోలీసుల మైండ్ బ్లాంక్
Robbery
Follow us on

డాక్ట‌ర్ అవ్వాల‌న్న‌ది అత‌డి కోరిక‌. అది అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. టాలెంట్‌తో పాటు కాసింత గ‌ట్టిగానే డ‌బ్బులు కావాలి. దీంతో హైద‌రాబాద్ సిటీకి వచ్చేశాడు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఉండ‌టంతో.. ఇంట్లో డ‌బ్బులు అడ‌గ‌లేక‌పోయాడు. డ‌బ్బు సంపాదించ‌డానికి కూడా అత‌డికి మార్గాలు క‌నిపించ‌లేదు. దీంతో త‌ప్పుడు మార్గం ఎన్నుక‌న్నాడు. ఏకంగా ఆల‌యాల‌నే టార్గెట్ చేస్తూ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన బాలాజీ త‌న‌యుడు మూలే సంతోష్‌ అలియాస్‌ రవి (21) ఎడ్యుకేష‌న్ కోసం హైదరాబాద్ వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ కంప్లీట్ చేశాడు. చిక్కడపల్లిలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. నీట్‌ రాసి.. మంచి ర్యాంక్ సంపాదించి డాక్టర్ అవ్వాల‌న్న‌ది అత‌డి ఆశ‌. గత ఏడాది నీట్ ఎగ్జామ్ రాసినా ర్యాంకు రాలేదు. దీంతో కోచింగ్‌ తీసుకోవాలని భావించాడు. అయితే పేరెంట్స్ వ‌ద్ద అంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో.. ఇంట్లో అడగలేక ఇత‌ర మార్గాల‌ను అన్వేశించాడు. చివరకు చేసేదేం లేక‌ ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆలయాల్లో చోరీలు చేసి తరువాత.. త‌న వ‌ద్ద డ‌బ్బు ఉన్నప్పుడు ఆలయంలో డ‌బ్బులు చెల్లించాలని అనుకున్నాడు. జనవరి నుంచి ఐదు నెలల్లోనే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో ఉండే 7 దేవాలయాల్లో హుండీలను పగులగొట్టి చోరీలు చేశాడు. తాజాగా పోలీసులు చిక్కడంతో విచారణలో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు చెప్పాడు.

ఎనిమిది ఆలయాల్లో దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీక‌రించాడు. అయితే తాను చేసింది త‌ప్పు కాదని.. ఎందుకు తనను అరెస్టు చేస్తారని పోలీసులనే ఎదురు ప్ర‌శ్నించాడు. దొంగతనం చేసిన‌ డబ్బును మళ్లీ ఉన్న‌ప్పుడు అదే హుండీలో వేస్తాను కాబట్టి తాను చేసింది తప్పే కాదన్నట్లు త‌న వెర్ష‌న్ వినిపిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Also Read: రేపు కేంద్ర విద్యా శాఖ ఉన్న‌త స్థాయి స‌మావేశం.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌..

హైద‌రాబాద్‌లో వ్యాక్సిన్ దొంగ‌లు.. 500 డోస్‌లు మాయం చేశారు..