Hyderabad operation mate carlo: విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం బయటపడింది. కార్ల స్కామ్‌తో హైదరాబాదీల గుట్టరట్టైంది. నిస్సాన్ పెట్రోల్, జీటీ-ఆర్, లాంబోర్గిని ఉరుస్, పోర్షే కయేన్నే… ఇవన్నీ ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరియస్ కార్స్. వీటి ప్రస్తావన ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత సీక్రెట్‌గా ఈ లగ్జరీ కార్లు వచ్చేస్తున్నాయి. విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకునే ఖరీదైన కార్ల స్కాం లేటెస్ట్‌గా ముంబైలో బయటపడింది. ముంబయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ మాంటె కార్లో’లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆపరేషన్లో ప్రముఖంగా హైదరాబాద్‌లోని బడాబాబుల పేర్లు బయటికొచ్చాయి. దీంతో డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు ముమ్మరం చేసింది.
హైదరాబాద్ డీఆర్‌ఐ అధికారులు రెండ్రోజుల క్రితం మలక్‌పేట ప్రాంతంలో ఖరీదైన ‘నిస్సాన్ పెట్రోల్’ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ రియల్టర్ దీన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నగరానికి చెందిన అనేక మంది ముంబయి ముఠా నుంచి కార్లు కొనుగోలు చేసినట్లు కీలక సమాచారం బయటికొచ్చింది. అక్రమంగా భారత్‌లో వాడుతున్న లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. కొన్నేళ్లుగా ముంబయి పోర్టుకు ఇలా 50 వరకూ కార్లు దిగుమతి అయ్యాయి. వాటిలో చాలా కార్లు హైదరాబాద్‌లో అమ్మారని డీఆర్‌ఐ అధికారులు భావిస్తున్నారు. కనీసం కోటిరూపాయల ధరకు పైగా ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మూవీ స్టార్లు కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు కొనుగోలు చేశారో గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్రమంగా కొన్న వారిపై కేసులూ నమోదు చేయనున్నారు.
విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కారు విలువపై 204 శాతం ఇంపోర్ట్ టాక్స్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు అక్రమంగా కార్లదందాకి తెరలేపారు.
Read Also…