
హైదరాబాద్ నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న 46 ఏళ్ల ప్రాచీకార్ అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. ఐతే.. ఆమెది ఆత్మహత్యా, లేదా మరణం వెనుక ఏదైనా రీజన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం రాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన నివాసంలో ప్రాచీకార్.. అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్నట్లు సమాచారం. గమనించిన ఫ్యామిలీ మెంబర్స్.. వెంటనే ఆమెను నిమ్స్‌కు తరలించారు. ఐతే.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె డెడ్‌బాడీని.. గాంధీ ఆస్పత్రి మార్చురూకి తరలించారు.
ప్రాచీకార్ మృతిపై ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. వారు ప్రస్తుతం షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఆత్మహత్యే అయితే, ఎందుకు చేసుకున్నారు? అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆమె మృతిపై హాస్పిటల్ వైద్యులు, స్టూడెంట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.