Viral: పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

Viral: పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Jul 06, 2024 | 8:00 PM

పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాపు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అమీర్ పేటలో జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అఖిల్‌ అనే యువకుడు అమీర్‌ పేట్‌ ఆదిత్య ఎన్‌క్లేవ్‌ లోని నీలగిరి బ్లాక్‌లో ఓ మొబైల్‌ రిపేరు దుకాణానికి వెళ్లాడు. తన మొబైల్‌ రిపేరు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఆ యువకుడు గతంలో ఆ షాపువారికి కొంత బకాయి ఉండటంతో..

పాత బకాయిలు అడిగినందుకు ఏకంగా షాపు సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అమీర్ పేటలో జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అఖిల్‌ అనే యువకుడు అమీర్‌ పేట్‌ ఆదిత్య ఎన్‌క్లేవ్‌ లోని నీలగిరి బ్లాక్‌లో ఓ మొబైల్‌ రిపేరు దుకాణానికి వెళ్లాడు. తన మొబైల్‌ రిపేరు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఆ యువకుడు గతంలో ఆ షాపువారికి కొంత బకాయి ఉండటంతో ఆ బకాయి చెల్లించాల్సిందిగా దుకాణంలోని సిబ్బంది కోరారు. అందుకు నిరాకరించిన యువకుడు అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

వారంతా షాపులోని సామగ్రిని సైతం ధ్వంసం చేశారు. ఆ షాపు సిబ్బంది ఆ యువకుడికి పాత బకాయిలు చెల్లించాలని అడగడమే ఈ గొడవకు కారణమైందని తెలిసింది. షాపు సిబ్బందిపై ఆ యువకులు దాడి చేయడం, షాపులోని సామాన్లను ధ్వంసం చేయడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.