Hyderabad: వామ్మో.. వీళ్ల తెలివి తగలెయ్య..! ఏటీఎంలను ఎలా దోచుకుంటున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

|

Nov 17, 2021 | 7:19 AM

స్మార్ట్‌ టెక్నిక్‌తో బ్యాంకులకు పంగనామం పెట్టారు ఆ కేటుగాళ్లు. ఎవరికి అర్ధం కాకుండా.. చేతికి మట్టి అంటకుండా చూసుకున్నారు. అయినా పోలీసులకు చిక్కారు. వారు ఊరుకుంటారా...దోచుకున్నదంతా కక్కించారు.

Hyderabad: వామ్మో.. వీళ్ల తెలివి తగలెయ్య..! ఏటీఎంలను ఎలా దోచుకుంటున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్
Atm Fraud
Follow us on

ఆయుధాలతో ఏటీఎంలు లూఠీ చేసిన వాళ్లను చూశాం. ఏటీఎంకు వచ్చే వాళ్ల దృష్టి మళ్లించి డబ్బులు కాజేసిన వాళ్ల గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో వెరైటీగా ఏటీఎంలో డబ్బు మాయం చేసే గ్యాంగ్‌ని చార్మినార్‌ పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం ట్యాపింగ్‌ టెక్నిక్‌తో బ్యాంకు అధికారులకు కూడా డౌట్‌ రాకుండా లక్షలు కాజేశారు. SBI ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకొని తమ ఆపరేషన్‌ చేస్తూ వచ్చారు నేరస్తులు. వేరే బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసి…అందులో కొంత డబ్బులు జమ చేసి …విత్‌ డ్రా చేసుకునేందుకు SBI ATM మిషన్‌లను వాడుకున్నారు. డబ్బును డిపాజిట్ మెషిన్​లో జమ చేయడానికి, విత్ డ్రా చేయడానికి ఒకే బాక్స్​లో ఫెసిలిటీ ఉంటుంది. ఇదే కేటుగాళ్ళకు అదునుగా మారింది. వీళ్ల టెక్నిక్‌ ఏమిటంటే..విత్‌ డ్రా మనీ సెలక్ట్ చేసి..డబ్బులు క్యాష్‌ ట్రేలోంచి బయటకు వస్తుండగా వాటిని పట్టుకొని…ATM మిషన్‌ స్విచ్‌ ఆఫ్ చేయడం. అక్కడ డబ్బులు నొక్కేస్తారు. అంతేగాక ఎక్కువ సేపు బాక్స్ డోర్ ఆగిపోవడంతో… ఎర్రర్ అని వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. డబ్బు విత్‌ డ్రా టైమ్‌లో కరెంట్ పోయిందని నగదు తిరిగి చెల్లించాలని బ్యాంక్‌ అధికారులకు కంప్లైంట్ చేసి మళ్లీ డబ్బులు కాజేయడం పనిగా పెట్టుకున్నారు.

బ్యాంక్‌ ATMలో పెట్టిన అసలు మొత్తంలో నగదులో తేడా రావడంతో ముఠా చేస్తున్న గోల్‌మాల్ అర్ధం కాని బ్యాంక్ అధికారులు …పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నల్లకుంట, మీర్‌పేట్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇలాగే జరగడంతో కేసును సవాల్‌గా తీసుకొని ఈ ఖిలాడీ గ్యాంగ్‌ ఆటకట్టించారు పోలీసులు. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర నుంచి డబ్బు, పలు వాహనాలను రికవరీ చేసుకున్నారు. నిందితులు హర్యానా మేవత్ ప్రాంతానికి చెందన వాళ్లుగా గుర్తించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు SBI ఏటీఎంల వద్ద సెక్యూరిటీ తక్కువ ఉండటంతో ఈ ముఠా ఆ బ్యాంక్ ఏటీఎంలను ట్యార్గెట్ చేసుకుని ఈ మోసాలకు తెరలేపింది. 3 కమిషనరెట్ల పరిధిలో మొత్తం 43 చోట్ల ఈ గ్యాంగ్ డబ్బు మాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక