Hyderabad Crime News: రోజు రోజుకీ మనిషిలోని మానవత్వం, మంచి చేదు విచక్షణ మాయమవుతుందా అనిపిస్తుంది కొన్ని సంఘటనలను విన్నా.. చూసినా. ఈర్ష అసూయలతో తాను మనిషిననే విషయం మరచి మానవ మృగంగా మారుతున్నాడు.. మనిషి అన్న పదానికే మాయని మచ్చ తెస్తున్నాడు.. తాజాగా ఓ మహిళ తన అసూయా, ఈర్షాద్వేషాలతో ఓ ముక్కుపచ్చలారని పసిబాలుడి ఉసురు తీసింది. మూడేళ్లు కూడా నిండని ఆ బాలుడికి రెండో అంతస్తుకు తీసుకుని వెళ్లి.. చుట్టుపక్కల వారు అందరూ చేస్తుండగానే అక్కడ నుంచి కిందకు విసిరేసింది.. ఈ దారుణాన్ని నివారించడానికి అందరూ చేసిన ప్రయత్నాలు వృద్ధమయ్యాయి. దీంతో ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. తనకు పిల్లలు లెకపోవడం.. బావ కొడుకుని అందరూ ముద్దు చేస్తున్నారని.. ఈర్ష అసూయతో రగిలిపోయిన ఆ మహిళ ఇంతటి దారుణాన్ని పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే గతంలోనూ ఊహతెలియని బాలుడిని శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ పాతబస్తీలోని ఈదీ బజార్ కుమార్ వాడికి చెందిన మహ్మద్ ఎతేషాముద్దీన్ (32), సుజావుద్దీన్ (27) అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే భవనంలో కలిసి నివసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఎతేషాముద్దీన్‌కు అస్మాసిద్దికా (26)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒకకుమార్తె పుట్టి.. కేవలం ఐదు రోజులకే మరణించింది. తర్వాత మూడేళ్ళ క్రితం ఓ బాబు పుట్టాడు. నుమానుద్దీన్ పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అందులోను ఆ కుటుంబంలో అందరూ పెద్దవారు.. నుమాద్దీన్ ఒక్కడే చిన్నవాడు కావడంతో అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో ఏడాదిన్నర క్రితం సుజావుద్దీన్‌కు ఆయేషాబాను (24)తో వివాహమైంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే తన భర్త సుజావుద్దీన్ కూడా తన తోడికోడలు పిల్లాడిని ప్రేమగా చేరదీయడం ఆమెకు నచ్చలేదు.. దీనితో బాలుడిపై అకారణ ద్వేషం పెంచుకుంది. గతంలో బాలుడిని కరెంట్ షాక్ తో చంపాలని చూడడం.. బాలుడి వేళ్ళు.. తెలుపులో పెట్టి నొక్కడం వంటి వికృతి చేష్టలు చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అయేషాబా ను తీవ్రంగా మందలించారు. దీంతో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పెద్దలు నచ్చ చెప్పడంతో కొన్ని రోజుల క్రితం అత్తవారింటికి తిరిగి వచ్చింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బాలుడిని భవనం రెండో అంతస్తుపైకి తీసుకెళ్లింది. బాలుడి చేతులు, కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కిందకు తోసేసింది. ఆ సమయంలో చూసిన వారు వారించినా వినకుండా పసివాడిని రెండు అంతస్థుల పై నుంచి కిందకు విసిరేసింది. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితురాలు ఆయేషాబానును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: